Thursday, April 24Welcome to Vandebhaarath

ED Officers Arrest | ఏసీబీ అధికారులకు చిక్కిన ఈడీ అధికారులు

Spread the love

లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అరెస్ట్

‌  ED Officers Arrest | లంచం తీసుకున్న ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ అయ్యారు. (ED Officers Arrest) ఒక కేసు ఆపేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన ఈడీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

జైపూర్‌: లంచం తీసుకున్న ఆరోపణలతో ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టయ్యారు. (ED Officers Arrest) ఒక కేసును ఆపేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన ఈడీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక చిట్ ఫండ్ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఈడీ అధికారులైన నావల్ కిశోర్ మీనా, బాబూలాల్ మీనా ఇద్దరూ.. రూ.15 లక్షలు అడిగారు. ఈడీ ఇన్‌స్పెక్టర్లు ఒక మధ్యవర్తి వ్యక్తి నుంచి ఆ డబ్బులు తీసుకుంటుండగా రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్రాప్‌ చేసి అరెస్టు చేసింది. ఆ ఇద్దరు ఈడీ అధికారుల నివాసాల్లో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

READ MORE  vande bharat sleeper train : వచ్చే ఏడాది స్లీపర్ కోచ్ వందేభారత్ ట్రైన్ వస్తోంది..

కాగా, కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌లో ఈనెల 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించిన కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌ను అక్టోబరరు 30న ఈడీ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది..
మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన కుమారుడిని ఈడీ ప్రశ్నించడం.. రాజకీయ ప్రతీకార చర్య అని అశోక్‌ గెహ్లాట్ విమర్శించారు.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆరోపించాయి. కాగా, ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

READ MORE  Delhi Liquor Scam | దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ సమన్లు ​​జారీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *