ఏథర్ ఎనర్జీ “ఏథర్ సర్వీస్ కార్నివాల్”(Ather service carnival) ని ప్రకటించింది. ఇది నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు దేశవ్యాప్తంగా అతి తక్కువ ధరలో వాహన సేవలను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్‌లు భారతదేశంలోని 140 పైగా ఏథర్ సర్వీస్ సెంటర్‌లలో ఏథర్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి.
పండుగల సీజన్ కొనసాగుతున్న తరుణంలో.. ఏథర్ సర్వీస్ కార్నివాల్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. తమ వాహనాలను నిరంతరాయంగా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ఏథర్ తన వినియోగదారులను ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా ఏథర్ యజమానులు ప్రత్యేకమైన ఆఫర్‌ల నుంచి ప్రయోజనం పొందవచ్చు. వీటిలో ఉచిత 15-పాయింట్ల సమగ్ర వాహన హెల్త్ చెకప్ ఉంటుంది.
వాహన సర్వీస్ పై డిస్కౌంట్లు
అలాగే, Ather లేబర్ ఛార్జీలపై 10% తగ్గింపును అందిస్తోంది. అధిక-నాణ్యత సేవను మరింత సరసమైనదిగా చేస్తుంది. కస్టమర్లు విడిభాగాలపై 5% తగ్గింపును కూడా పొందవచ్చు. వారి వాహనాల నిర్వహణ ఖర్చుగణనీయంగా తగ్గుతుంది.
అదనంగా, కస్టమర్‌లు తమ సమీప ఏథర్ సేవా కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఇతర ఆఫర్‌లను కూడా తెలుసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ల నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి, Ather యజమానులు తమ సమీప ఏథర్ సర్వీస్ సెంటర్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోమని చెబుతున్నారు.
Ather వాహనాలకు పండుగ ఆఫర్లు
ఏథర్ కంపెనీ ఇటీవలే తమ 450S తోపాటు 450X మోడళ్లపై పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. సంప్రదాయ పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాల నుంచి ఏథర్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు మారాలని చూస్తున్న కస్టమర్‌ల కోసం ఏథర్ 450X (2.9 kWh, 3.7 kWh), Ather 450S (2.9 kWh) పై రూ.40,000 వరకు ఎక్సైంజ్ డిస్కౌంట్ ను అందిస్తోంది.
ఫైనాన్స్ సౌకర్యం కూడా..
ఈ ఎక్స్ఛేంజ్ విలువను కొత్త ఏథర్ స్కూటర్ కోసం డౌన్ పేమెంట్‌గా ఉపయోగించుకోవచ్చు, మిగిలిన మొత్తాన్ని రిటైల్ ఫైనాన్సింగ్ ఆప్షన్‌ల ద్వారా చెల్లించుకునే వెలుసుబాటు కూడా కంపెనీ అందిస్తోంది. ఎక్సైంజ్ విలువతో పాటు, Ather Energy 450S మరియు 450Xపై ఫెస్టివ్ బెనిఫిట్ (రూ. 5000 వరకు), కార్పొరేట్ తగ్గింపు (రూ. 1500), క్రెడిట్ కార్డ్ EMI క్యాష్‌బ్యాక్ (రూ. 6000 వరకు) వంటి ప్రయోజనాలను ఏథర్ అందిస్తోంది..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..