Delhi Congress Leaders Quit Party | ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇద్దరు పార్టీ సీనియర్లు నీరజ్ బసోయా, నసీబ్ సింగ్‌లు కాంగ్రెస్ ను వీడారు. ఈ ఇద్దరు నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన వేర్వేరు లేఖ అందించారు. అవినీతిలో కూరుకుపోయిన ఆప్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం తాము జీర్ణించుకోలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు.
పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు నీరజ్ బసోయా మాట్లాడుతూ “ఢిల్లీలో ఆప్‌తో ఆ పార్టీ పొత్తు పెట్టుకున్నందుకు బాధపడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు రోజురోజుకూ పెద్ద చెడ్డపేరు తెచ్చిపెడుతోంది. ఆత్మగౌరవం ఉన్న పార్టీ నాయకుడిగా నేను ఇకపై పార్టీతో ఉండలేనని అన్నారు. తాను పార్టీలోని అన్ని పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. . గత 30 ఏళ్లలో నాలాంటి సామాన్యుడికి అన్ని అవకాశాలు కల్పించినందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు అని లేఖలో పేర్కొన్నారు.
వాయువ్య ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు నసీబ్ సింగ్ కూడా ఆప్ తో పొత్తును నిరసిస్తూ కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా దేవిందర్ యాదవ్ నియామకంపై నసీబ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “అరవింద్ కేజ్రీవాల్ తప్పుడు ఎజెండాపై గతంతో దాడి చేసిన దేవిందర్ యాదవ్ ఇప్పుడు అతను ఢిల్లీలో సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసించడం ఏంటని ప్రశ్నించారు.
కాగా, ఇటీవల డీపీసీసీ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ కూడా ఆప్‌తో పొత్తు పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ పార్టీని వీడారు. తన అభిప్రాయానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఆప్‌తో జట్టు కట్టారని విమర్శిస్తూ ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తాజాగా ఆయన బాటలోనే మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..