
గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణం.. కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు మృతి
కోచ్చి: కేరళ (Kerala) లోని కొచ్చి లో కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యు లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కారు నడిపే వ్యక్తి గూగుల్ మ్యాప్ (Google Map) సాయంతో డ్రైవింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. భారీ వర్షం, దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం (Accident) సంభవించినట్లు భావిస్తున్నారు. స్థానిక వార్తల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు గోతురుత్ ప్రాం తంలో పెరియార్ నదిలో పడిపోయింది. ఈ ప్రమా దంలో యువ వైద్యులు అద్వైత్ (29), అజ్మల్ (29) మృతిచెందారు.ఈ ప్రమా దంలో కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారు ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన ఈ ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది. కాగా కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ సాయంతో డ్రైవింగ్ చేస్తున్నాడని.. అయ...