Thursday, November 14Latest Telugu News
Shadow

CM Yogi Adithyanath | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. మ‌హారాష్ట్ర‌లో సంచ‌ల‌నం రేపుతున్న యోగీ పోస్ట‌ర్లు

CM Yogi Adithyanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త‌నదైన పాల‌న‌తో ఉత్త‌ర ప్ర‌దేశ్ రూపురేఖ‌ల‌ను స‌మూలంగా మార్చేశారు. ఇపుడు ఆయ‌న ఇమేజ్‌ను మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో కూడా ఉప‌యోగ‌పడుతోంది. దేశంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న బీజేపీ నేత సీఎం యోగి ఆదిత్యనాథ్. బెంగాల్-త్రిపుర నుంచి కర్ణాటక-తెలంగాణ వరకు సీఎం యోగి ఎన్నికల ప్రచార‌కార్య‌క్రామ‌ల‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. క్రిమినల్ కేసుల్లో నిందితుల‌పై ఈ బుల్డోజర్ బాబా తీసుకునే చ‌ర్య‌లు బిజెపి పాలిత రాష్ట్రాలనే కాకుండా ప్రతిపక్ష రాష్ట్రాలను కూడా సంతోషపరుస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌లోనూ, ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలించిన పంజాబ్‌లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

ఇటీవ‌ల ముంబై వీధుల్లో సీఎం యోగి పోస్టర్లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. దానిపై యోగీ ప్రకటన ‘బాటేంగే టు కటేంగే…’ అని రాసి ఉంది. ప్ర‌స్తుతం ఇది వేగంగా వైరల్ అవుతోంది. ముంబైలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నినాదం ‘విభజిస్తే విడిపోతాం.. సర్వత్రా వినిపిస్తోంది.

READ MORE  PM Modi: సీఏఏ ర‌ద్దు చేయ‌డం ఎవ‌రి వల్లా కాదు.. ప్రధాని మోదీ.. బెంగాల్‌లో ప్రధానికి ఊహించని గిఫ్ట్‌

వాస్తవానికి.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను అక్టోబర్ 20న బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితా బయటకు వచ్చిన తర్వాత మహాయుతిలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అటువంటి పరిస్థితిలో, కళ్యాణ్-తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం, థానే సహా అనేక స్థానాలపై టిక్కెట్ల విషయాలు వివాదాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఇదే సమయంలో ముంబై వీధుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటనతో కూడిన పోస్టర్లు వెలిశాయి. టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు చేసే మహాయుతి నాయకులకు సందేశం పంపేందుకే ఈ పోస్టర్లు అంటించారని పలువురు పేర్కొన్నారు. ముంబైలోని అంధేరీలో సీఎం యోగి పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. అందులో – ‘విభజిస్తే నాశనమైపోతావు.. ఐక్యంగా ఉంటే ఉత్తమంగా ఉంటావు అనే అర్థం వచ్చేలా రాసి ఉంది.

READ MORE  Congress | అయోధ్యకు వెళ్లినందుకు వేధించారు. అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేశా..

బంగ్లాదేశ్‌(Bangladesh)లో జరుగుతున్న హింసాకాండకు సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆగ్రాలో ‘బాటేంగే టు కటేంగే’ నినాదం ఇచ్చారు. అయితే, కాలక్రమేణా అది ఎన్నికల అంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన బహిరంగ సభల్లో ఈ నినాదాన్ని ప్రస్తావించారు.

సీఎం యోగి ఏం చెప్పారు?

ఆగ్రాలో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం యోగి (CM Yogi Adithyanath) బంగ్లాదేశ్‌ను ఉదాహరణగా చూపుతూ, ‘బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం యోగి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారని సీఎం యోగి అన్నారు. ఈ తీర్మానాన్ని నెరవేర్చేందుకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మ‌న ముందుకు వ‌చ్చిన అతిపెద్ద‌ స‌వాల్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని యోగీ అన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మానికి ఎదుర‌వుతున్న స‌వాల్ యావ‌త్ భార‌త్ కు కూడా స‌వాలేన‌ని అన్నారు.మరోసారి సమాజాన్ని విభజించే కుట్ర జరుగుతోందన్నారు. దీనిని నివారించాలంటే సామాజిక వివక్షను అరికట్టాలి అని కోరారు.

READ MORE  Haryana Exit Poll Results | హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *