Central Government Scheme | ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తూ అందులో ఉపాధి అవకాశాలను అందించాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి నమోదు ప్రక్రియ ఇంకా ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇందులో ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ ద్వారా నెలకు రూ.30000 వరకు పొందే ఛాన్స్ ఉంటుంది. దేశంలో ఉన్న కోట్లాది మంది భారతీయులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలను అందిచేందుకు మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం (Ayushman Bharat Scheme) అమలు చేస్తున్నారు. హాస్పిటల్స్ లో ఈ పథకం అమలుకు సహాయంగా ఆయుష్మాన్ మిత్రలను పనిచేస్తుంటారు.
ఆయుష్మాన్ మిత్ర కీలక వివరాలు
ఆయుష్మాన్ భారత్ అమలులో సహాయం, లబ్దిదారుల కార్డులను సజావుగా తయారు చేయడం ఇంకా రోగులకు మద్ధతుగా నిలవడం. దీనికి జీతం నెలకు 5000 నుంచి 20000 వేల వరకు ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర (Ayushman Mitra) అర్హత చూస్తే.. 12 ఉత్తీర్ణత పొంది.. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి పాధమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సి ఉంటుంది. స్థానిక భాష ఇంకా హిందీ లేదా ఇంగ్లీష్ లో పరిజ్ణానం ఉండాలి.
ఆయుష్మాన్ మిత్ర ఉద్యోగ బాధ్యతలు..
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రచారం చేయాలి.. హాస్పిటల్ విధానాలు, ఆయుష్మాన్ కార్డులను రూపొందించడానికి ప్రజలకు సహాయం చేయాలి. క్యూ.ఆర్ కోడ్ ద్వార ఐడీని ధృవీకరించాలి. దానితో పాటుగా భీమా ఏజెన్సీలకు డేటాని పంపించాల్సి ఉంటుంది. రాత పూర్వక అసైన్ మెంట్ నిర్వహించడం.. ఇంకా ఆధార్ తో డేటా వెరిఫికేషన్ లో సాయాహం చేయడం చేయాలి.
ఆయుష్మాన్ మిత్ర కు అవసరమైనవి..
ఆధార్ కార్డ్, గుర్తంపు కార్డ్, చిరునామా ప్రూఫ్, 12వ తరగతి మార్కు షీట్, బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
అప్లై చేసే విధానం..
- అధికారిక వెబ్ సైట్ https://pmjay.gov.in/ కి వెళ్లాలి.
- హోం పేజీలో రిజిస్టర్ చేసుకోవడానికి అన్న దాని దగ్గర క్లిక్ చేయాలి.
- ఆధార్ నెంబర్ ఇంకా మొబైల్ నంబర్ ఇవ్వాలి. అప్లై ని క్లిక్ చేయాలి.
- మొబైల్ కి ఓటీపీ వస్తుంది. అది అక్కడ ఎంటర్ చేసి కొనసాగించాలి.
- వివరాలు రిజిస్ట్రేషన్ లో పూర్తించాలి. అవసరమైన పత్రాలను జత చేయాలి.
- పూర్తైన తర్వాత సబ్ మిట్ చేసి లాగిన్ ఐడి పాస్ వర్డ్ వస్తుంది అది జాగ్రత్తగా ఉంచుకోవాలి.
లాగిన్ ప్రాసెస్..
- అధికారిక వెబ్ సైట్ https://pmjay.gov.in/ ను ఆయుష్మాన్ మిత్ర పోర్టల్ కి వెళ్లాలి.
- హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసి ఆయుష్మాన్ మిత్ర లాగిన్ ని ఎంచుకోవాలి.
- మీ మొబైల్ నంబర్ ఇంకా క్యాప్చా కోడ్ ను రాయాలి.
- జెనరేట్ ఓటీపీ క్లిక్ చేసి లాగిన్ చేయడానికి మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
- Central Government Scheme ఆయుష్మాన్ మిత్ర లక్ష మంది దాకా నియమించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో 20000 మందిని తీసుకున్నారు. శిక్షణ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఇస్తారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..