Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?

Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?

Bengaluru Water Crissis ఒకప్పుడు ‘వెయ్యి సరస్సుల నగరం’ అని పిలిచిన బెంగళూరు నేడు పట్టణీకరణతో క్ర‌మంగా శిథిలమైపోతోంది. 16వ శతాబ్దంలో బెంగళూరు ను అభివృద్ధి చేసిన ఘనత విజయనగర సామ్రాజ్యానికి చెందిన కెంపె గౌడకు దక్కుతుంది. బెంగుళూరులో న‌దులు లేవు.. నగరం సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ బావులు, కాలువల‌ను విస్తృతంగా నిర్మించాడు. ఆ కాలంలో ఇవి వ్యవసాయంతోపాటు పెరుగుతున్న జనాభాకు స‌రిపోయింది. వ‌ర‌ద‌ నీటిని సరస్సుకు తరలించేందుకు కాలువలు నిర్మించ‌డంతో వరదలు, కరువు స‌మ‌స్య‌లు ఏర్పడలేదు.

సరస్సులు ఎలా మారిపోయాయి..?

1896 కి ముందు, హేసరఘట్ట నుంచి మొదటి పైపులైన్ ద్వారా నీటి సరఫరా వచ్చినప్పుడు, సరస్సులు, బావులు బెంగుళూరు నివాసులకు నీటి అవ‌స‌రాలు తీర్చాయి. నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి నిర్వహణలో కెంపె గౌడ చేసిన కృషి బెంగళూరు అభివృద్ధికి బీజం ప‌డింది. దక్షిణ భారతదేశంలో వాణిజ్యం, సంస్కృతికి కేంద్రంగా దాని ఖ్యాతిని పెంచ‌డంలో కీలక పాత్ర పోషించింది.

READ MORE  Greater Bengaluru Authority | ఇక ఐదు జిల్లాలుగా బెంగళూరు మహా న‌గ‌రం.. కేబినెట్ ఆమోదం

నేడు బెంగ‌ళూరు నగరం తీవ్ర‌మైన నీటి ఎద్ద‌డితో పోరాడుతోంది. చారిత్రక సరస్సులు క‌నుమ‌రుగ‌య్యాయి. బెంగుళూరులో ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీలు ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరిగాయి. నివాసాలు, కార్యాలయాలు, స్టేడియంలు, ఆట స్థలాలు, రవాణా మౌలిక సదుపాయాలు మొదలైన వాటి కోసం భూమి కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి చెరువులు, కుంట‌ల‌ను అక్ర‌మించేశారు.

water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

సరస్సులు నీటిని నిల్వ చేస్తాయి, భూగర్భ జలాశయాలను రీఛార్జ్ చేస్తాయి. ఏడాది పొడవునా ప్ర‌జ‌ల‌కు నీటిని అందిస్తాయి. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో శతాబ్దాల క్రితం రాజులు, రాజ కుటుంబ సభ్యులు నిర్మించిన సరస్సులు నేటికీ నీటిని అందిస్తూనే ఉన్నాయి . కానీ బెంగళూరుకు ఈ అదృష్టం లేదు. నేడు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Water Crissis  మిగిలిన చెరువులు కూడా డంపింగ్‌ గ్రౌండ్‌లుగా మారాయి. వ్యర్థాలు, విషపూరిత రసాయనాలకు డంపింగ్ కేంద్రాలుగా చెరువులు జీవుల‌కు ముప్పుగా మార్చింది. బెల్లందూరు సరస్సు బెంగళూరులో అతిపెద్దది. కానీ ఇది అత్యంత కలుషితమైనది. నగరంలోని చాలా వరకు మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు ఇందులోకి వదులుతున్నారు. ఈ సరస్సు వర్తూరు సరస్సుకు ప్రవహిస్తుంది ఈ కార‌ణంగా అది కూడా కలుషితమవుతుంది.

READ MORE  Nitish Kumar | బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గెలిచిన సీఎం నితీశ్‌..

సరస్సులపైనే రియల్ ఎస్టేట్ లేఔట్లు

గత కొన్ని దశాబ్దాలుగా, బెంగళూరులోని వందలాది సరస్సులు.. బస్ స్టేషన్‌లు, రియ‌ల్ ఎస్టేట్‌ లేఅవుట్లు, గోల్ఫ్ క్లబ్‌లు, కళాశాలలు, ప్రభుత్వ భవనాలుగా మారిపోయాయి. వాటిలో అతిపెద్దది ధర్మాంబుధి సరస్సు, ఇది గాంధీనగర్ నుంచి సుబేదార్ చత్రం (SC) రోడ్ వ‌ర‌కు విస్త‌రించి ఉండేది. ఇది 1950వ దశకం చివరి వరకు వాడుకలో ఉంది. నీటిపారుదల కొరకు స్థానికుల ఇతర అవసరాలను తీర్చడానికి నీరు ఉపయోగించేవారు.
అదేవిధంగా, అశోక్ నగర్ ఫుట్‌బాల్ స్టేడియం షూలే చెరువుపై నిర్మించబడింది. కోరమంగళ సరస్సు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NDRI) పునాది పూడ్చివేశారు. సరస్సు కు చెందిన కొన్ని భాగాలు నేటికీ మిగిలి ఉన్నప్పటికీ, సరస్సులో ఎక్కువ భాగం ఇప్పుడు భవనాలతో నిండిపోవడంతో  అది అంతరించిపోయినట్లు కనిపిస్తోంది.  జక్రాయ సరస్సు కృష్ణా ఫ్లోర్ మిల్స్‌గా మారింది.  హెన్నూరు సరస్సు ఇప్పుడు HBR లేఅవుట్ (నాగవర)గా మారింది.

READ MORE  Bengaluru-Ernakulam | జూలై 31 నుంచి బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ప్రారంభం.. ఈ స్టేషన్లలో హాల్టింగ్

ఇలా ఒకప్పుడు సరస్సులు, కుంటలతో కళకళలాడిన బెంగళూరు నగరం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది. దాహమేస్తే గుక్కెడు నీళ్లు కూడా కరువైపోయింది. ఇప్పటికైనా ఎక్కడికక్కడ ఇంకుడుగుంతలు, కుంటలు నిర్మించకుంటే  సమీపభవిష్యత్ లో బెంగళూరు ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

2 thoughts on “Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *