Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?
Bengaluru Water Crissis ఒకప్పుడు 'వెయ్యి సరస్సుల నగరం' అని పిలిచిన బెంగళూరు నేడు పట్టణీకరణతో క్రమంగా శిథిలమైపోతోంది. 16వ శతాబ్దంలో బెంగళూరు ను అభివృద్ధి చేసిన ఘనత విజయనగర సామ్రాజ్యానికి చెందిన కెంపె గౌడకు దక్కుతుంది. బెంగుళూరులో నదులు లేవు.. నగరం సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బావులు, కాలువలను విస్తృతంగా నిర్మించాడు. ఆ కాలంలో ఇవి వ్యవసాయంతోపాటు పెరుగుతున్న జనాభాకు సరిపోయింది. వరద నీటిని సరస్సుకు తరలించేందుకు కాలువలు నిర్మించడంతో వరదలు, కరువు సమస్యలు ఏర్పడలేదు.
సరస్సులు ఎలా మారిపోయాయి..?
1896 కి ముందు, హేసరఘట్ట నుంచి మొదటి పైపులైన్ ద్వారా నీటి సరఫరా వచ్చినప్పుడు, సరస్సులు, బావులు బెంగుళూరు నివాసులకు నీటి అవసరాలు తీర్చాయి. నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి నిర్వహణలో కెంపె గౌడ చేసిన కృషి బెంగళూరు అభివృద్ధికి బీజం పడింది. దక్షిణ భారతదే...