Bengaluru water crisis | బెంగళూరుతో ముదురుతున్న నీటి సంక్షోభం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Bengaluru water crisis | కావేరి నదిలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో బెంగళూరు వాటర్ సప్లై, సీవేజ్ బోర్డు (BWSSB) కఠినమైన చర్యలు తీసకోవాలని భావిస్తోంది. కొన్ని రోజులుగా సిలికాన్ సిటీ బెంగళూరు తీవ్ర నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే.. మే నెల ప్రారంభమవుతున్న నేపథ్యంలో బెంగళూరులో రక్షిత తాగునీటి లభ్యతపై ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. ప్రధాన నీటి వనరుగా కావేరి నదిపై ఎక్కువగా ఆధారపడుతోంది బెంగళూరు నగరం అయితే కావేరి జలాలు తగ్గుముఖం పట్టడంతో నీటి కొరత విపత్తును ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం, కావేరి జలాశయంలో కేవలం 11 వేల మిలియన్ క్యూబిక్ (TMC) అడుగుల నీరు ఉంది. 5 TMC డెడ్ స్టోరేజీగా నిర్ణయించబడింది. దీనివల్ల 6 టీఎంసీల నీరు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటే, బెంగళూరు అవసరాలను తీర్చడానికి నెలకు సుమారుగా 1.8 TMC నీరు అవసరం. బెంగళూరులో నీటి పంపిణీకి బాధ్యత వహించే ఏజెన్సీ బెంగళూరు వాటర్ బోర్డు వారానికి మూడు రోజులు నగరానికి నీటిని సరఫరా చేస్తోంది. అయితే కావేరి రిజర్వాయర్‌లో నీటిమట్టం ప్రమాదకరంగా పడిపోతున్న నేపథ్యంలో వారానికి ఒకసారి నీటి సరఫరాను పరిమితం చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?
అయితే నీటి కొరత నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాబోయే నెలల్లో తగిన వర్షాలు లేకుంటే పరిస్థితి మరింత దిగజారవచ్చు. బెంగళూరు సంక్షోభంలో కూరుకుపోతుందని నగరవాసులు కలవరపడుతున్నారు. ఈ క్రమంలో BWSSB నీటి సంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. రాబోయే నీటి కొరతను తగ్గించడానికి నీటిని తెలివిగా ఉపయోగించమని నగరవాసులను కోరుతోంది.
ఏప్రిల్ 30 లోపు ఏరేటర్స్ ను అమర్చుకోవాలి..
నగర వాసులకు బెంగుళూరు నీటి సరఫరా బోర్డు (BWSSB) ఏప్రిల్ 30 లోపు కుళాయిలపై ఏరేటర్‌లను కచ్చితంగా అమర్చుకోవాలని ప్రకటించింది. ఈ గడువులోగా అమర్చకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. అయితే మొదట ఈ నిబంధనకు మార్చి 31ని డెడ్‌లైన్‌గా నిర్ణయించింది, చాలా మంది కస్టమర్‌లు మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేయగా ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. కాగా తుది గడువును ఉన్నప్పటికీ, బెంగుళూరులోని అనేక ప్రాంతాలు ఇంకా ఏరేటర్లను అమర్చుకోలేదు. దీని కారణంగా BWSSB రేపటి వరకు తుది పొడిగింపును అమలు చేసింది.కుళాయిలలో నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి, నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి ట్యాప్ అవుట్‌లెట్‌లకు ఈ ఏరేటర్లు అమర్చుతారు. వాటర్ బోర్డ్ ప్రకారం, ఏరేటర్లు 60 నుండి 85 శాతం నీటిని ఆదా చేయగలవు, ఇది నీటి కొరత సమస్యలతో పోరాడుతున్న నగరానికి అత్యంత కీలకమైనది.
నగరంలో నీటికొరతను పరిష్కరించడానికి ఏరేటర్‌లను ఇన్ స్టాల్ చేయాలని నిర్ణయించారు. వీటిని వాణిజ్య దుకాణాలు, పరిశ్రమలు, అపార్ట్‌మెంట్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లతో సహా అన్ని పబ్లిక్ ప్రాంతాలకు వర్తిస్తుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..