BSNL News : మాన్‌సూన్ డబుల్ బొనాంజా.. నెలకు రూ. 399కి ఫైబర్ బేసిక్ ప్లాన్ తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్
BSNL News : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫైబర్ బేసిక్ ప్లాన్‌పై పరిమిత-కాల ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ప్లాన్ ప్రకారం, కస్టమర్‌లు నెలకు కేవలం రూ. 399తో ఈ ప్లాన్‌ను పొందవచ్చు. అయితే దీని అసలు ధర రూ. 499 కాగా ఇప్పుడు రూ.100 తగ్గించింది. మాన్‌సూన్ డబుల్ బొనాంజా (BSNL Monsoon Double Bonanza) పేరుతో BSNL ఈ ఆఫర్ ను తీసుకొచ్చి భారత్ ఫైబర్‌ను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ప్లాన్ వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాలకు తగిన హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇస్తుందని బిఎస్ఎన్ఎల్ వెల్లడించింది. తమ ప్రస్తుత ఇంటర్నెట్ కనెక్షన్‌ని అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్న కస్టమర్‌లు ఈ ప్రమోషన్‌ను పొందవచ్చు, ఇది పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
BSNL ఫైబర్ బేసిక్ ప్లాన్
BSNL లో ఫైబర్ బేసిక్ ప్లాన్ మొదటి మూడు నెలలకు రూ.399 గా నిర్ణయించింది. ఈ ప్లాన్ తీసుకున్న కస్టమర్‌లకు 60 Mbps స్పీడ్ నుంచి 3300 MB వరకు అందిస్తుంది. దాని ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) 4 Mbps వేగం వర్తిస్తుంది. BSNL కస్టమర్‌లు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత లోకల్, STD కాల్‌లను చేసుకోవచ్చు.
ఈ ఆఫర్‌ను ఎలా పొందాలి?
ఈ ఆఫర్‌ను పొందడానికి మీరు వాట్సాప్ ద్వారా 1800-4444కు హాయ్ అని టైప్ చేసి పంపాలి. బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే BSNL ఈ పరిమిత కాల ఆఫర్ ను తీసుకొచ్చింది.
#MonsoonDoubleBonanza Alert! Enjoy our Fibre Basic Plan at just ₹399/month, down from ₹499! Plus, get your first month FREE! Limited time offer. T&C apply.
Say ‘Hi’ on WhatsApp at 1800-4444 for more details!#BharatFibre #BSNLFTTH #BSNL #Switch_To_BSNL pic.twitter.com/8mbxmGo12O— BSNL India (@BSNLCorporate) July 9, 2024
BSNL మాన్‌సూన్ డబుల్ బొనాంజా వివరాలు
ఆఫర్ ధర – రూ. నెలకు 399 (మొదటి మూడు నెలలు)
అసలు ధర – రూ. నెలకు 499
డేటా స్పీడ్ – 60 Mbps (మొదటి 3300 MB)
FUP స్పీడ్ – 4 Mbps
కాల్స్ – అపరిమిత లోకల్ STD కాల్స్
కాంటాక్ట్ – 1800-4444కు ‘హాయ్’ అని వాట్సాప్ చేయండి
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..