BSNL News : మాన్‌సూన్ డబుల్ బొనాంజా.. నెలకు రూ. 399కి ఫైబర్ బేసిక్ ప్లాన్ తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్
BSNL News : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫైబర్ బేసిక్ ప్లాన్‌పై పరిమిత-కాల ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ప్లాన్ ప్రకారం, కస్టమర్‌లు నెలకు కేవలం రూ. 399తో ఈ ప్లాన్‌ను పొందవచ్చు. అయితే దీని అసలు ధర రూ. 499 కాగా ఇప్పుడు రూ.100 తగ్గించింది. మాన్‌సూన్ డబుల్ బొనాంజా (BSNL Monsoon Double Bonanza) పేరుతో BSNL ఈ ఆఫర్ ను తీసుకొచ్చి భారత్ ఫైబర్‌ను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ప్లాన్ వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాలకు తగిన హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇస్తుందని బిఎస్ఎన్ఎల్ వెల్లడించింది. తమ ప్రస్తుత ఇంటర్నెట్ కనెక్షన్‌ని అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్న కస్టమర్‌లు ఈ ప్రమోషన్‌ను పొందవచ్చు, ఇది పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
BSNL ఫైబర్ బేసిక్ ప్లాన్
BSNL లో ఫైబర్ బేసిక్ ప్లాన్ మొదటి మూడు నెలలకు రూ.399 గా నిర్ణయించింది. ఈ ప...