BJP on Reservation | కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేలా బీజేపీ తాజా ప్రకటన..
BJP on Reservation | అనేక సందర్భాల్లో రిజర్వేషన్ల (Reservation) ను పునర్విభజన చేయాలనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని బీజేపీ తన తాజా ప్రకటన ద్వారా బహిర్గతం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల 7వ, చివరి దశకు దేశం సిద్ధమవుతున్న వేళ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం #MeraVoteMeraAdhikar అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక వీడియో ప్రకటనను విడుదల చేసింది. అందులో రిజర్వేషన్ల పునర్విభజనపై కాంగ్రెస్ ఉద్దేశాన్ని బట్టబయలు చేయడానికి ప్రయత్నించింది. ‘మైనారిటీ’ వర్గాలను సంతృప్తి పరచడానికి మన దళిత, గిరిజన, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను తగ్గించిన విషయాన్ని ఆ ప్రకటనలో ప్రస్తావించింది. .
BJP on Reservation : 48 సెకన్ల నిడివి గల వీడియోలో, SC/ST/OBC రిజర్వేషన్ల గురించి అట్టడుగు వర్గాల్లో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ మాస్ హిస్టీరియా సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా మార్చిందో, ఎస్సీలకు రిజర్వేషన్లను ఎలా తొలగించిందో కాషాయ పార్టీ వివరించింది. వెనుకబడిన సమాజాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకిస్తోందని, బాబా సాహెబ్ అంబేద్కర్‌ను విస్మరించిందని, గిరిజనులకు న్యాయం చేసేందుకు ఏనాడూ కృషి చేయలేదని కొందరు యువకులు ఆ ప్రకటనలో చర్చిస్తున్నట్లు చూడవచ్చు. జామియా మిలియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాల వంటి ప్రభుత్వ సంస్థల్లో ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్లను అనుమతించని ఏకైక పార్టీ కాంగ్రెస్ అనే విషయాన్ని వారు వెలుగులోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ 2009 ఎన్నికల మేనిఫెస్టోలో భారత జాతీయ కాంగ్రెస్ కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో మైనారిటీలకు రిజర్వేషన్‌లకు తీసుకువచ్చిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంకా, 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ/ఎస్టీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయత్నించినా, దానిని అమలు చేయడంలో విఫలమయ్యారు. 2011లో దేశమంతటా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. అదేవిధంగా, 2015లో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్‌లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2015లో ముస్లిం సమాజానికి ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు కల్పించేందుకు ఐదుసార్లు ప్రయత్నించింది. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.
ముస్లింలకు ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రమాదకరమైన పన్నాగాన్ని వెలుగులోకి తెస్తూ, తన ప్రధాన ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో, ఈ వీడియో దేశంలోని పౌరులకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సందేశాన్ని ఇచ్చింది.
అమిత్ షా, నడ్డా స్పందన..
ఇదిలా ఉండగా బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు మతపరమైన రిజర్వేషన్లు అనుమతించబోమని జేపీ నడ్డా స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల నుండి రిజర్వేషన్‌లను తొలగించి, మత ప్రాతిపదికన వాటిని తిరిగి కేటాయించడానికి కాంగ్రెస్ వంటి ఇతర రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు ఇటీవల బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పునరుద్ఘాటించారు.
అదేవిధంగా, బిజెపి సీనియర్ నాయకుడు అమిత్ షా కూడా ఇటీవల ఓబిసి రిజర్వేషన్లను తగ్గించి, ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ యత్నిస్తోందని తెలిపారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నిరాధారమైన అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాయని ఏప్రిల్ 28 ఆదివారం హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు.
“నేటికీ, జామియా మిలియా, అలీఘర్ విశ్వవిద్యాలయాలలో SC/ST/OBC రిజర్వేషన్లు అమలు చేయడంల ఏదని, దీనికి ఏకైక కారణం SC/ST/OBC పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానమే. వారు ఎప్పుడూ వెనుకబడిన సమాజాన్ని వ్యతిరేకించారు, బాబా సాహెబ్ అంబేద్కర్‌ను విస్మరించారు. గిరిజనులకు న్యాయం చేయడానికి ఎప్పుడూ కృషి చేయలేదు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా నియమించి గిరిజనులకు న్యాయం చేసేందుకు కృషి చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ అని, బీజేపీ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్లకు ఎలాంటి హానీ ఉండదని ఇది మోదీ హామీ’’ అని అమిత్ షా స్పష్టం చేశారు.
मैं नहीं दूंगा इनको अपना आरक्षण छीनने का अधिकार और न ही दूंगा इनको वोट।
आपका संवैधानिक हक छीनने वालों से खबरदार।
देशहित में जारी…#MeraVoteMeraAdhikar pic.twitter.com/S3Yd5ja0oF
— BJP (@BJP4India) May 29, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..