BJP campaign video : 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార గీతాన్ని ఆవిష్కరించిన బీజేపీ
BJP campaign video : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కావడంతో 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గురువారం బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా “సప్నే నహీ హకీకత్ బంతే హై, తాభీ తో సబ్ మోడీ కో చుంటే హై ” అనే పాట (BJP song ) ను విడుదల చేశారు. మొదటి సారి ఓటర్ల సమ్మేళనం (నవ్ మత్తత సమ్మేళన్) లో జరిగిన ప్రచార ప్రారంభం సందర్భంగా కోట్లాది మంది భారతీయుల కలలు, ఆకాంక్షలను ప్రధాని మోదీ ఎలా నిజం చేశారో తెలిపే మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జేపీ నడ్డా (JP Nadda) మాట్లాడుతూ.. ఈ ప్రచార నినాదం కేవలం కొద్దిమంది అనుభవించిన సెంటిమెంట్ మాత్రమే కాదు.. అది జనంలో ప్రతిధ్వనిస్తుందని బిజెపి గట్టిగా నమ్ముతుంది” అని పార్టీ పేర్కొంది. పార్టీ కార్యకర్తలందరూ దేశంలోని ప్రతి మూలకు వెళ్లి ఈ కీలక ప్రచారం గురించి అవగాహన కల్పించాలని నడ్డా కోరారు. “ప్రధానమంత్రి మోడీ ప్రజల కలలకు వాస్తవ రూపం ఇచ్చారు. గత తరం, ప్రస్తుత తరం, భవిష్యత్తు తరానికి చెందిన కలలకు హామీ ఇస్తున్నారు.”మోదీ ప్రభుత్వ కార్యక్రమాలు కోట్లాది కలలను సాకారం చేశాయి. యువత స్టార్టప్‌లు, వ్యవస్థాపక రుణాల ద్వారా ఉద్యోగాలు పొందారు. ఆత్మనిర్భర్‌గా మారారు. రైతులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా అమ్మవచ్చు. బీజ్ నుండి బజార్ వరకు సంపూర్ణ మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చారు. మహిళలకు ఇప్పుడు ప్రాతినిధ్యం పెరిగింది. పేదలు పేదరికం నుండి బయటపడి ఇప్పుడు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.
ప్రచారంలో దూకుడు
ఇదిలా ఉండగా మరికొద్దిరోజుల్లో ఒక ప్రత్యేకమైన, ఫుట్ ట్యాపింగ్ మాస్ సాంగ్‌ని కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ హోర్డింగ్‌లు, డిస్‌ప్లే బ్యానర్‌లు, డిజిటల్ ఫిల్మ్‌లు, టీవీసీలు అన్నీ దశలవారీగా విడుదల చేయనున్నారు. వీటిలో ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట డొమైన్‌లో ప్రధాని మోడీ ఏమి సాధించారనే విషయాన్ని వెల్లడిస్తుంది.
BJP campaign video : Modi Ko Chunte Hain (మోడీని మళ్లీ గెలిపించుకుందాం)’ పేరుతో వచ్చిన పాట ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది.. ఈ స్పెషల్ వీడియో దాదాపు 2 నిమిషాల 12 సెకన్ల నిడివి ఉంది. ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయాలను హైలైట్ చేశారు.. అలాగే వివిధ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘మేము చేసేది నిజం.. కలలు కాదు.. అందుకే మోదీని మళ్లీ ఎన్నుకుంటారు..’ అంటూ సాగే ఈ వీడియో లో, ఉజ్వల, డీబీటీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రతి ఇంటికి కుళాయి నీరు, మెట్రో స్టేషన్లు, ఖేలో ఇండియా, డిజిటల్ అండ్ యూపీఐ పేమెంట్స్, స్వయం ఉపాధి రంగాలు, బాలికా విద్య, చంద్రయాన్-3, ఇస్రో విజయాలు, ప్రపంచ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలు, బ్లాక్ మనీ కట్టడి , ఆత్మ నిర్భర్ భారత్, యువకులకు స్యయం ఉపాధి అవకాశాలు,, జాతీయ రహదారుల నిర్మాణం… ఇలా గత పదేళ్ల బీజేపీ ప్రభుత్వంలో భారతదేశం సాధించిన అభివృద్ధిని చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
सपने नहीं हकीकत बुनते हैं,
तभी तो सब मोदी को चुनते हैं…Today, BJP National President Shri @JPNadda launched BJP’s official campaign for the 2024 general elections in the virtual presence of Honourable Prime Minister @narendramodi. pic.twitter.com/cqpcekKWEV
— BJP (@BJP4India) January 25, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..