Bihar Politics LIVE Updates | పాట్నా : జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జేడీయూ-బీజేపీ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం వరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి? ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య జేడీయూ వద్ద ఉన్నదా? అనే అంశాలను పరిశీలిద్దాం.
243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.. ఆర్జేడీ పార్టీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. మరో వైపు 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతి పెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు కేవలం 45 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 122 సీట్లు కావాలి. ఈ లెక్కల ప్రకారం.. ఆర్జేడీకి ఇంకా 43 మంది సభ్యులు అవసరం ఉంటారు.. జేడీయూ-బీజేపీ కలిస్తే వారి కూటమికి 123 మంది ఎమ్మెల్యేల బలం వస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస సంఖ్య సరిపోతోంది. దీంతో బీజేపీ-జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు ఏమాత్రం ఢోకా ఉండదు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు నితీశ్‌కు మద్దతు తెలుపు తూ లేఖలు ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఒక వేళ బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బీజేపీ సభ్యులు.. ఆర్జేడీ మంత్రుల స్థానంలో ప్రమాణం చేసే చాన్స్ ఉంది.
మరో వైపు ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది.. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇప్పటికే తాము కూడా ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తామని చెప్పారు. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఆ కూటమికి మొత్తం 112 మంది సభ్యుల బలం ఉంది.
జేడీయూతో కలవాలని బీజేపీ ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం
Bihar BJP | బీహార్‌లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీహార్ సీఎం నితీశ్‌కుమార్ (Nitish Kumar) మహాకూటమి నుంచి బయటకు వచ్చి తన సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అర్లేకర్ వెంటనే ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు కూడా. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీహార్ బీజేపీ శాసనసభాపక్షం సమావేశమైంది.
Bihar Politics LIVE Updates రాష్ట్రంలో జేడీయూతో కలిసి సర్కారును ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ‘ప్రజల క్షేమం కోసం బీహార్‌లో జేడీయూ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని తెలిపారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియా కు వివరించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..