Posted in

Bajaj CNG Bike | ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వస్తోంది.. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ..

bajaj cng bike price
Spread the love

Bajaj CNG Bike : దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల ‘బజాజ్ ఫైటర్’ పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ పేరు కంపెనీ రాబోయే CNG బైక్ కావచ్చని అందరూ భావిస్తున్నారు. బజాజ్ తీసుకొచ్చే CNG బైక్‌ ప్రపంచంలోనే మొట్టమొదటిది కానుంది. కంపెనీ గత నెలలో బజాజ్ బ్రూజర్ పేరును కూాడా ట్రేడ్‌మార్క్ చేసింది. దీనిని బట్టి  బజాజ్ ఫైటర్ కంపెనీ నుంచి వచ్చే రెండో CNG బైక్  అని తెలుస్తోంది.

CNG బైక్ జూన్ 18న విడుదల

బజాజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇటీవల జరిగిన పల్సర్ 400 లాంచ్ ఈవెంట్‌లో కీలక విషయాలను వెల్లడించారు. ప్రపంచంలోనే తొలి CNG బైక్‌ను జూన్ 18న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయ పెట్రోల్‌తో నడిచే బైక్‌తో పోలిస్తే, దాని రన్నింగ్ ఖర్చు సగం వరకు తగ్గుతుంది. అలాగే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా స్థిరంగాకొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రాబోతున్న CNG బైక్ తో రన్నింగ్ ఖర్చులు తగ్గిపోయిన వినియోగదారులకు భారీగా ఊరటనివ్వనున్నాయి. ఇది మొదట మహారాష్ట్రలో, తర్వాత CNG స్టేషన్లు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో ప్రారంభించనుంది. కాగా CNG బైక్‌ల పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తామని, ఇందులో 100 CC, 125 CC, 150-160 CC బైక్‌లు ఉంటాయని రాహుల్ బజాజ్ అన్నారు. ఇంజన్ కెపాసిటీ 110-125cc మధ్య ఉండనుంది. ఈ బైక్ ధర సుమారు రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) ఉంటుందని సమాచారం.

bajaj cng bike .. ప్రోటోటైప్‌ను పరీక్షించిన సమయంలో.. కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలలో 50% తగ్గగా. కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉద్గారాలలో 75% తగ్గింది. అలాగే నాన్-మీథేన్ హైడ్రోకార్బన్ ఉద్గారాలలో 90% తగ్గిందని కంపెనీ పేర్కొంది. దీనిని బట్టి CNG బైక్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగదు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *