Ram Temple | శరవేగంగా అయోధ్య రామమందిరం నిర్మాణం.. వీడియో రిలీజ్‌ చేసిన ట్రస్ట్‌

Ram Temple | శరవేగంగా అయోధ్య రామమందిరం నిర్మాణం.. వీడియో రిలీజ్‌ చేసిన ట్రస్ట్‌

Ayodhya Ram Temple | భారతదేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని అయోధ్య (Ayodhya) లో చేపట్టిన రామ మందిర (Ayodhya Ram Mandir ) నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని.. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి భక్తులకు శ్రీరామచంద్రుని దర్శించుకునే భాగ్యం కల్పిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (Shri Ram Janmbhoomi Teerth Kshetra) ట్రస్ట్‌ ఇప్పటికే వెల్లడించింది. వచ్చే ఏడాది 2024 జనవరి 21-23 తేదీల్లో ఆలయ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, ఆలయ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఆలయ ట్రస్ట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

READ MORE  జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి

అయోధ్య లో రామమందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం విదితమే.. గర్భ గుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకలను స్థాపించారు.. మూడు అంతస్తుల్లో, ఐదు మండపాలుగా చేపడుతున్న రామాలయ నిర్మాణానికి సుమారు రూ.1,800 కోట్లు ఖర్చు అవుతాయని ట్రస్టు సభ్యులు ఇప్పటికే వెల్లడించారు.. అహ్మదాబాద్ కు చెందిన టెంపుల్‌ ఆర్కిటెక్ట్స్‌ ‘సోమ్ పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిరం నిర్మాణ బాధ్యతలను నిర్వర్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *