Posted in

Ration Card Application | కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సై.. వచ్చేనెల 2 నుంచి దరఖాస్తులు

Ration Card Application
New Ration Cards
Spread the love

Ration Card Application |  ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర స‌చివాల‌యంలో గురువారం స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రేష‌న్ కార్డుల మంజూరుకు సంబంధించి మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. రేష‌న్ కార్డులు మంజూరుకు ప‌టిష్ట‌మైన‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూత‌న రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు 2వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ (Ration Card Application ) ను స్వీక‌రించాల‌ని సీఎం సూచించారు.

అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చే అంశంపై చర్చించారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష సమావేశం నిర్వ‌హించాల‌ని  నిర్ణ‌యించారు. ఇదిలా ఉండగా ఈసారి ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులను వేర్వేరుగా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం త్వరలోనే సర్వే నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.   స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, మాణిక్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి ఎం.ర‌ఘునంద‌న్‌రావు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి డి.ఎస్‌.చౌహాన్ ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *