New SIM Card Rules : కొత్త ‘టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023’ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం అక్రమ పద్ధతుల్లో సిమ్ కార్డులను తీసుకుంటే రూ. 50 లక్షల వరకు జరిమానా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు సరైన ధ్రువీకరణ ప్రతాలను సమర్పించి మీరు తొమ్మిది SIM కార్డ్‌లను పొందడం సాధ్యమవుతుంది.
జాతీయ భద్రతను మెరుగు పరిచేందుకు ఈ చట్టం టెలికాం సర్వీస్ లేదా నెట్‌వర్క్‌ను పూర్తిగా నియంత్రించేందుకు లేదా పర్యవేక్షించేందుకు ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు టెలికాం నెట్‌వర్క్‌లో కమ్యూనికేషన్‌లను రద్దు చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం భారతీయులెవరూ తొమ్మిది కంటే ఎక్కువ SIM కార్డ్‌లను పొందేందుకు వీలు లేదు. మరోవైపు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ నివాసితులు గరిష్టంగా ఆరు సిమ్ కార్డ్‌లకు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. పరిమితికి మించి అదనంగా సిమ్ కార్డులను పొందడం వల్ల మొదటిసారి రూ. 50,000, ఆ తర్వాత ప్రతిసారీ రూ. 2 లక్షల వరకు జరిమానా విధించనున్నారు.
స్పామ్ కాల్స్ కు అడ్డుకట్ట
New SIM Card Rules : స్పామ్ కాల్స్ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కొత్త టెలికమ్యూనికేషన్ చట్టంలో ఇప్పుడు టెలికాం కంపెనీలు మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు టెలికాం కంపెనీలు ఎలాంటి ప్రచారాలు, ప్రకటనలకు సంబంధించిన సందేశాలను పంపే ముందు వినియోగదారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వినియోగదారుల ఫిర్యాదులను వినడానికి టెలికాం కంపెనీలు ఆన్‌లైన్ సిస్టమ్ ను తప్పనిసరిగా అందుబాటులోకి తీసుకురాలి. దీని వల్ల వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకోవచ్చు.
కొత్త టెలికాం బిల్లుకు గత ఏడాది డిసెంబర్ 21న రాజ్యసభ, డిసెంబర్ 20న లోక్ సభ ఆమోదం తెలిపాయి. అది చట్టం కావడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం అవసరం. ఈ చట్టంలో మొత్తం 62 సెక్షన్లు ఉన్నాయి, అయితే వాటిలో 39 మాత్రమే ప్రస్తుతం వర్తింపజేయబడుతున్నాయి. 138 ఏళ్లుగా టెలికాం పరిశ్రమను శాసించిన ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో ఈ చట్టం రానుంది. అదనంగా, ఈ బిల్లు 1933 ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టాన్ని భర్తీ చేస్తుంది. అంతేకాకుండా, ఇది 1997 నాటి TRAI చట్టాన్ని సవరిస్తుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..