
అలీఘర్: ఉత్తర ప్రదేశ్ లో కరడుగట్టిన గ్యాంస్టర్లు, నేరస్తులను మట్టి కరిపిస్తున్నారు యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ (Yogi Adityanath).. తాజాగా ఓ ఎన్నికల ప్రచారంలో ఆయన సమాజానికి ముప్పుకలిగించేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘నేరస్థులను హెచ్చరిస్తున్నా.. సమాజ భద్రతకు ఎవరు ముప్పు కలిగిస్తారో వారి ‘రామ్నామ్ సత్య’ (Ram Naam Satya – చివరి కర్మలు) ఖాయమని అన్నారు. అలీగఢ్ (Aligarh) లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సతీష్‌కుమార్ గౌతమ్ తరఫున నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఆడబిడ్డలు, అమాయక ప్రజలు ఏ ఆందోళన లేకుండా రాత్రిపూట ప్రశాంతంగా బయటికు వెళ్లగలిగేలా ఉండాఆలని, ఆడపిల్లల భద్రతకు ఎవరైనా ప్రమాదం తలపెడితే మేము ‘రామ్నామ్ సత్య’ (చివరి కర్మలు) చేస్తామని యూపీ సీఎం ఆధిత్యనాత్ హెచ్చరించారు. రామ నామాన్ని జపిస్తూ మేము మా జీవితాలను గడుపుతున్నాము. రాముడు లేకుంటే ఏదీ సాధ్యం కాదు.. కానీ ఎవరైనా సమాజ భద్రతకు ముప్పు కలిగిస్తే, ‘రామ్‌నామ్ సత్య’ కూడా ఖాయమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
నిరంతర ప్రగతి, అభివృద్ధి కోసం ఓటు వేయాల్సిన ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు. పదేళ్ల క్రితం ఏ కలలు కన్నది ఇప్పుడు సాకారం అవుతోంది. అది మీ ఓటుతోనే జరుగుతుందని అన్నారు. ఇంతకు ముందు అరాచకాలు, కర్ఫ్యూలు, అక్రమాలు ఉండేవి అని ఆదిత్యనాథ్ అన్నారు.
వచ్చే ఎన్నికల ఫలితాలపై యోగి ఆదిత్యనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు, ప్రజలు ఇప్పటికే మోడీ ప్రభుత్వానికి మూడవసారి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. “మొదటిసారి, ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా, ప్రజలు ఇప్పటికే ఫలితంపై నమ్మకంతో ఉన్నారు. వారు మూడవసారి మోడీ ప్రభుత్వం (తిశ్రీ బార్, మోడీ సర్కార్) అని ఇప్పటికే నిర్ణయించుకున్నారు” అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే, మొదటి మూడేళ్లలో భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆయన అన్నారు. “ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అలీఘర్ కూడా అభివృద్ధి చెందినప్పుడే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ప్రధాని మోడీకి మూడవసారి అధికారం ఇస్తే, మొదటి మూడేళ్లలో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. అని అన్నారు.
పార్లమెంటుకు గరిష్టంగా 80 మంది ఎంపీ స్థానాలు గల ఉత్తరప్రదేశ్ మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 23 మరియు జూన్ 1 ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..