
Anti-Conversion Bill : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం, జూలై 30, UP చట్టవిరుద్ధమైన మత మార్పిడి (సవరణ) బిల్లు, 2024ను బలవంతపు మార్పిడులకు శిక్షను పెంచే బిల్లును ఆమోదించింది. ఒక మహిళను మోసం చేసి లేదా మతం మార్చి వివాహం చేసుకున్నందుకు ₹ 50,000 జరిమానాతో 10 సంవత్సరాల శిక్ష గతంలో ఉండగా కొత్త బిల్లు ప్రకారం ఇప్పుడు ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది చట్టవిరుద్ధమైన మత మార్పిడి (సవరణ) బిల్లు, 2024ను యాంటీ లవ్ జిహాద్ లా అని కూడా పిలుస్తారు. దీనిని సోమవారం సభలో ప్రవేశపెట్టగా మంగళవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో వర్షాకాల సమావేశాల్లో ఆమోదం లభించింది. దోషులను శిక్షించే నిబంధనలను సవరణ కఠినతరం చేసింది. ఇప్పటికే ఉన్న నేరాలకు శిక్షను పెంచారు.
సవరణలోని నిబంధనలు ఏమిటి?
సవరించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి బెదిరించినా, దాడి చేసినా, వివాహం చేసుకున్నా లేదా పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినా లేదా అందుకోసం కోసం కుట్ర చేసినా, లేదా మతమార్పిడి ఉద్దేశంతో స్త్రీని, మైనర్ లేదా ఎవరినైనా అక్రమంగా రవాణా చేస్తే, అతని నేరం అత్యంత తీవ్రమైన కేటగిరీలో చేర్చుతారు. సవరించిన బిల్లు అలాంటి కేసులలో 20 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదును విధిస్తుంది.
మత మార్పిడి నిరోధక బిల్లులో కీలక అంశాలు..
- Anti-Conversion Bill : సవరించిన నిబంధన ప్రకారం, ఇప్పుడు ఎవరైనా మార్పిడి కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. ఇంతకుముందు ఈ కేసులో సమాచారం ఇవ్వడానికి లేదా ఫిర్యాదు చేయడానికి బాధితుడు తల్లిదండ్రులు, తోబుట్టువుల హాజరు అవసరం, కానీ ఇప్పుడు పరిధిని పెంచారు. ఇప్పుడు ఎవరైనా దీని గురించి పోలీసులకు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వవచ్చు.
- లవ్ జీహాద్ కేసులను సెషన్స్ కోర్టు దిగువన ఉన్న ఏ కోర్టు విచారించదని, దీనితో పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అవకాశం ఇవ్వకుండా బెయిల్ పిటిషన్‌ను పరిగణించదని ప్రతిపాదించారు. అలాగే ఇందులోని నేరాలన్నింటినీ నాన్ బెయిలబుల్ గా మార్చారు.
- నవంబర్ 2020లో దీని కోసం ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ తరువాత, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఉభయ సభలు బిల్లును ఆమోదించిన తర్వాత, ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం-2021 అమలులోకి వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేశ్ ఖన్నా సోమవారం బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
- చట్టవిరుద్ధంగా సామూహిక మత మార్పిడికి కొత్త బిల్లులో ప్రతిపాదించిన శిక్ష 7 నుండి 14 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే ₹ 1 లక్ష జరిమానా విధించనున్నారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం అదే నేరానికి 3 నుండి 10 సంవత్సరాల శిక్ష, ₹ 50,000 జరిమానా విధించేవారు.
- చట్టవిరుద్ధంగా మత మార్పిడికి ఉద్దేశించి విదేశీ నిధులు సమకూర్చేవారికి 7 నుండి 14 సంవత్సరాల జైలు శిక్ష, ₹ 10 లక్షల జరిమానా విధించబడుతుంది.
- చట్టవిరుద్ధమైన మతమార్పిడి కోసం ఎవరైనా స్త్రీని అపహరించినందుకు దోషిగా తేలితే, ప్రతిపాదిత సవరణ ప్రకారం 20 సంవత్సరాల జైలు శిక్ష, జీవిత ఖైదు వరకు విధించనున్నారు.
- “ప్రత్యేక మత మార్పిడికి గురైన బాధితురాలికి నిందితుడు చెల్లించాల్సిన సముచిత పరిహారాన్ని కూడా కోర్టు ఆమోదిస్తుంది, అది ₹ 5 లక్షల వరకు ఉండవచ్చు, అది జరిమానాతో పాటు అదనంగా ఉంటుంది” అని బిల్ పేర్కొంది,
- మైనర్, వికలాంగుడు లేదా మానసిక వికలాంగుడు, స్త్రీ లేదా షెడ్యూల్డ్ కులానికి లేదా షెడ్యూల్డ్ తెగకు చెందిన వ్యక్తి ప్రమేయం ఉన్న సందర్భాల్లో, దోషిగా తేలిన వ్యక్తి 14 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు ₹ 1 లక్షకు పైగా జరిమానా విధిస్తారు. ప్రస్తుత ఉన్న చట్టం ప్రకారం అదే నేరానికి గరిష్టంగా 10 సంవత్సరాల శిక్ష, కనీసం ₹ 25,000 జరిమానా విధించేవారు.
- సవరించిన బిల్లు బెయిల్ నిబంధనను మరింత కఠినతరం చేయడానికి అదనపు ఉప-నిబంధనను జోడించింది. బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించే అవకాశం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఇవ్వకపోతే కస్టడీలో ఉన్న నిందితుడిని బెయిల్‌పై విడుదల చేయలేరు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..