ప్రపంచంలో 3వ అత్యంత కాలుష్య దేశంగా భారత్.. టాప్ 50లో 42 భారతీయ నగరాలే.. నివేదికలో విస్తుగొలిపే వాస్తవాలు..
World Air Quality Report |ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాలు, నగరాలపై చేపట్టిన సర్వేలో భారత్‌కు ఊహించని ఫలితాలు వచ్చాయి. స్విస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ బాడీ IQAir విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత భారతదేశం మూడవ అత్యంత కాలుష్య దేశంగా ప్రకటించింది.
‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023’ ప్రకారం, ప్రతి క్యూబిక్ మీటరుతో పోలిస్తే.. , 2023లో బంగ్లాదేశ్ (క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములు), పాకిస్తాన్ ((క్యూబిక్ మీటరుకు 73.7 మైక్రోగ్రాములు) తర్వాత 134 దేశాలలో భారతదేశం (సగటు వార్షిక PM2.5 54.4 మైక్రోగ్రాములు )మూడవ అత్యంత తక్కువ గాలి నాణ్యతను కలిగి ఉంది. ఇక 2022లో, క్యూబిక్ మీటర్‌కు సగటున 53.3 మైక్రోగ్రాముల PM2.5 సాంద్రతతో భారతదేశం ఎనిమిదో అత్యంత కలుషితమైన దేశంగా ర్యాంక్ ను మూటగట్టుకుంది.
గౌహతి PM2.5 గాఢత 2022, 2023 మధ్య క్యూబిక్ మీటరుకు 51 నుండి 105.4 మైక్రోగ్రాములకు రెట్టింపు అయింది.
తీవ్రమైన వాయు కాలుష్యంతో పోరాడుతున్న ఢిల్లీ, క్యూబిక్ మీటరుకు PM2.5 గాఢత 89.1 నుండి 92.7 మైక్రోగ్రాములకు పెరిగింది.
World Air Quality Report లో గ్రేటర్ నోయిడా (11), ముజఫర్‌నగర్ (16), గుర్గావ్ (17), అరాహ్ (18), దాద్రీ (19), పాట్నా (20), ఫరీదాబాద్ (25), మీరట్ (28), ఘజియాబాద్ (35) మరియు రోహ్తక్ (47) వంటి నగరాలు మొదటి 50 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేరిపోయాయి.
IQAir ప్రకారం, దాని నివేదికలోని డేటా.. 134 దేశాలు, భూభాగాలు, ప్రాంతాలలో 7,812 ప్రదేశాలలో 30,000 కంటే ఎక్కువ గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ల నుండి శాంపిళ్లను సేకరించబడింది.
2023 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ కీలక వివరాలు
- 2023లో ప్రపంచంలో అత్యంత కలుషితమైన టాప్ 5 దేశాలు: బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇండియా, తజికిస్తాన్, బుర్కినా ఫాసో.
- Cleanest Country in the world : WHO వార్షిక PM2.5 ప్రమాణాలు (వార్షిక సగటు 5 µg/m 3 లేదా అంతకంటే తక్కువ) పాటించిన ఏడు దేశాల్లో ఆస్ట్రేలియా, ఎస్టోనియా, ఫిన్‌లాండ్, గ్రెనడా, ఐస్‌లాండ్, మారిషస్ , న్యూజిలాండ్ ఉన్నాయి.
- ఆఫ్రికా అత్యంత తక్కువ ప్రాతినిధ్యం లేని ఖండంగా మిగిలిపోయింది, జనాభాలో మూడవ వంతు మందికి ఇప్పటికీ గాలి నాణ్యత డేటా అందుబాటులో లేదు.
- ప్రపంచంలోని మొదటి పది అత్యంత కాలుష్య నగరాలలో 9 భారతదేశానికి చెందినవి.
- చైనా కూడా ఐదు పర్యాయాలు వార్షిక క్షీణత తర్వాత, గత సంవత్సరం PM2.5 6.3% పెరిగి 32.5 మైక్రోగ్రాములకు చేరుకుంది.
- ఈ సర్వే చరిత్రలో మొట్టమొదటిసారిగా, కెనడా ఉత్తర అమెరికాలో అత్యంత కలుషితమైన దేశంగా ఉంది, ఈ ప్రాంతంలోని 13 అత్యంత కాలుష్య నగరాలు చేరాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
హైదరాబాద్ స్థానం ఎంత..?