Tuesday, April 8Welcome to Vandebhaarath

Python | షాకింగ్ న్యూస్‌.. మ‌హిళ‌ను మింగిన కొండ‌చిలువ‌.. మూడురోజుల త‌ర్వాత వెలుగులోకి..

Spread the love

Python | ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ భారీ కొండచిలువ ఏకంగా ఓ మ‌హిళ‌ను మింగేసింది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్‌లోని కలెంపాంగ్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన‌ 45 ఏళ్ల ఫరీదా ఆదృశ్యం కాగా మూడు రోజులుగా ఆమె కోసం గాలించారు. దీంతో ఆమె భర్త,ఇరుగుపొరుగువారు చివ‌ర‌కు ఓ రెటిక్యులేటెడ్ కొండచిలువ పొట్ట లోప‌ల మ‌హిళ మృత‌దేహాన్ని (Woman Found Dead inside Python ) కనుగొన్నారు. ఆ కొండచిలువ 5 మీటర్లు (16 అడుగులు) పొడ‌వు ఉంది.

గురువారం రాత్రి ఫ‌రీదా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం భ‌ర్త‌తోపాటు గ్రామస్థులు గాలించారు. ఒక చోట భారీ కొండచిలువ పెద్ద పొట్ట‌తో అటూఇటూ క‌దులుతూ క‌నిపించింది. దీంతో అనుమానం వ‌చ్చి దాని పొట్ట‌ను కోసి చూడ‌గా అంద‌రూ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. పాము పొట్ట‌లో ఫరీదా తల కనిపించింది. కొండచిలువ పొట్ట‌లో పూర్తిగా దుస్తులతో ఉన్న ఫ‌రీదా మృత‌దేహం ఉంది.

READ MORE  Boy Returns As Monk | 22 ఏళ్ల క్రితం తప్పిపోయి సన్యాసిగా మారి.. భిక్ష కోసం తల్లి వద్దకు.. కన్నీళ్లు పెట్టించిన వీడియో

గతంలోనూ షాకింగ్ ఘ‌ట‌న‌లు..

ఇండోనేషియా (Indonesia ) లో కొన్నేళ్లుగా కొండచిలువలు మనుషులను టార్గెట్ చేయడం వంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని స్థానికులు చెబుతున్నారు.  ఇలాంటి సంఘ‌ట‌న‌లు అత్యంత‌ అరుదు. కొండచిలువలు మ‌నుషుల‌ను మింగిన కొన్ని ఘ‌ట‌న‌లు ఇటీవలి సంవత్సరాలలో  ఆందోళన కలిగిస్తున్నాయి. గత సంవత్సరం, ఆగ్నేయ సులవేసిలోని టినాంగ్‌గెయా జిల్లా నివాసితులు ఎనిమిది మీటర్ల కొండచిలువను చూశారు. అది గ్రామంలోని ఒక రైతును మింగేందుకు య‌త్నించ‌గా వారు దానిని చంపేశారు.

2017, 2018 మధ్య మరో రెండు మరణాలు నమోదయ్యాయి. 2018లో వా టిబా, మునా ద్వీపంలో తన కూరగాయల తోటలో ఓ మ‌హిళా రైతు అదృశ్యమైంది. తరువాత ఏడు మీటర్ల కొండచిలువ లోపల ఆమె మృత‌దేహాన్ని కొనుగొన్నారు. ఆమె చెప్పులు. కొడవలి నుంచి కేవ‌లం 30 మీటర్ల దూరంలో మాత్రమే ఈ పామును క‌నుగొన్నారు.
2017లో, పశ్చిమ సులవేసిలోని ఒక రైతును పామాయిల్ తోటలో నాలుగు మీటర్ల కొండచిలువ మింగేసింది.

READ MORE  Mathura | మధుర, బృందావన్‌లోని ప్ర‌సాదాల‌పై అల‌ర్ట్‌.. నమూనాలను ల్యాబ్ కు త‌ర‌లింపు

ముఖ్యంగా, పైథాన్‌లు తమ ఎరను పూర్తిగా మింగ గల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎర ను బ‌ట్టి వాటి ద‌వ‌డ‌ల‌ను ఊహించంత‌గా పెద్ద‌వి చేస్తాయి. అవి తమ మాంసాహారులపై ఆకస్మికంగా దాడి చేస్తాయి. అంటే త‌మ‌ ఆహారం దగ్గరగా వచ్చే వరకు అవి వేచి ఉంటాయి. సరైన క్షణం వరకు నిశ్చలంగా ప‌రిస‌రాల్లో క‌లిసిపోయి ఉంటాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *