భగవద్గీత శ్లోకంతో అలారం మోగే సరికొత్త పరికరం
శ్వేతార్క గణపతి ఆలయంలో ప్రారంభం
వరంగల్: హన్మకొండ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో మంగళవారం కొత్త అలారం సిస్టం ఏర్పాటు చేశారు. ఈ అలారం సిస్టమ్ ఒకసారి సమయాన్ని అనుసరించి అలారం మోగడంతోపాటు ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. దేవాలయ కార్యకర్త గంగుల రాజిరెడ్డి ఈ యంత్ర పరికరాన్ని కొనుగోలు ఆలయానికి బహూకరించారు. స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ దీనిని ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిరోజు ప్రతి గంటకు ఒకసారి ఈ అలారం మోగుతూ గంటలు కొట్టి ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. భక్తులకు సమయం తెలుసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు వినడం కూడా జరగుతుందని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ పరికరాన్ని అందించిన గంగుల రాజిరెడ్డికి కార్పొరేటర్ జక్కుల రవీందర్, ఆలయ ప్రతినిధులు, భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ, మేనేజర్ లక్క రవి అసిస్టెంట్ మేనేజర్ దుర్గం సుధీర్, ఎలక్ట్రికల్ మేనేజర్ వి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Electric Vehicles కి సంబంధించిన అప్ డేట్స్ కోసం హరితమిత్ర పోర్టల్, తాజా వార్తల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..
అలాగే ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.