కార్మికులకు చేయూతనందించేందుకు మరో కొత్త పథకం: PM Modi
PM Modi : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు. వచ్చే విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ రోజున దేశంలో ‘విశ్వకర్మ యోజన’ (Vishwakarma Yojana) అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద దేశంలో స్వర్ణకారులు, ఫర్నిచర్ లేదా కలప వస్తువులను తయారు చేసేవారు అంటే వడ్రంగులు, సెలూన్లు నడిపే నాయీ బ్రాహ్మణులు, బూట్లు తయారు చేసేవారు, ఇళ్ళు నిర్మించే మేస్త్రీలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. కార్మికులు ఎవరైనా సరే స్వర్ణకారులు, మేస్త్రీలు, చాకలివారు.. హెయిర్ కట్ కుటుంబాల వారైనా.. అలాంటి వారిని బలోపేతం చేసేందుకు.. ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు.
‘స్వానిధి యోజన’ కింద దేశంలోని కోట్లాది మంది వీధి వ్యాపారులకు తమ ప్రభుత్వం రూ.50,000 కోట్ల వరకు ఆర్థికసాయం అందించిందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తెలిపారు. ఇపుడు పేదరికంలో మగ్గుతున్న దేశంలోని కోట్లాది మంది కుల వృత్తి చేసుకునే కార్మికులకు కూడా ఇలాంటి సహాయాన్నే అందించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఎక్కువ మంది ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చినవారే ఉన్నారు. ఈ పథకం రాబోయే విశ్వకర్మ జయంతి, సెప్టెంబర్ 17న ప్రారంభించబడుతుంది.
“ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రజలకు సాధికారత కల్పించడం.. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం మా లక్ష్యం అని ప్రధాని ఈ సంరద్భగా అన్నారు. రాబోయే 5 సంవత్సరాలలో, భారతదేశాన్ని ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉంచుతానని మోదీ హామీ ఇచ్చారు.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.