Wednesday, April 16Welcome to Vandebhaarath

Ration Cards | గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు

Spread the love

New Ration Cards |  పేద ప్రజలకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి కబరు చెప్పింది. త్వరలో అర్హులైన నిరుపేదలకు రేషన్‌ ‌కార్డులు, హెల్త్ ‌కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అది కూడా అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌, ‌హెల్త్ ‌కార్డులు వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ సమావేశం అనంతరం  మంత్రి ఉత్తమ్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ భేటీలో చర్చించిన విషయాలను విలేఖరులకు వివరించారు.

READ MORE  Ghatkesar MMTS | ఘట్ కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభం.. టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు ఇవే..

కొత్త రేషన్‌ ‌కార్డుల మంజూరు విషయమై విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్‌ ‌కార్డు అర్హులు ఎవరనేదానిపై త్వరలో జరగనున్న సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్‌ ‌కార్డులను ఎలా మంజూరు చేస్తున్నారనేదానిపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. రేషన్‌ ‌కార్డుల నిబంధనలు ఎలా  ఉండాలని పార్టీలకు లేఖలు రాశామని,  కొంద‌రు ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు అందించారని తెలిపారు. తమకు అందిన సలహాలు, సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని  వచ్చే సమావేశంలో చర్చిస్తామని  వివరించారు.

READ MORE  Vikarabad | సీఎం రేవంత్‌ రెడ్డి ఇలాకాలో కలెక్టర్‌పై రైతుల ళ్ల దాడి

కాగా రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్‌ ‌కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు.  రేషన్ కార్డుదారులకు ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని తెలిపారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం 49,000 రేషన్‌ ‌కార్డులు మాత్రమే ఇచ్చింద‌ని తెలిపారు. , అవి కూడా ఉప ఎన్నికలు ఉన్న యోజకవర్గాల్లోనే తెలిపారు.  బీఆర్‌ఎస్  ప్ర‌భుత్వం ‌రాష్ట్రవ్యాప్తంగా  రేషన్‌ ‌కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. సెప్టెంబర్ 21న‌ ‌మరోసారి కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ భేటీ నిర్వహిస్తామని, ఈ నెలాఖరులోగా కేబినెట్‌  ‌కమిటీ నివేదిక  ఇస్తుంద‌ని,  అక్టోబరులో అర్హులందరికీ కొత్త రేషన్‌ ‌కార్డులు (New Ration Cards ) అందిస్తామని మంత్రులు వెల్లడించారు.

READ MORE  Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *