Sunday, April 27Thank you for visiting

Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: కుంభ రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..

Spread the love

Kumba Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో కుంభ రాశి (Aquarius Horoscope) వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు.

  • ఆదాయము – 14
  • వ్యయము – 14
  • రాజపూజ్యము – 6
  • అగౌరవము – 1

ఈ సంవత్సరము కుంభ రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు చతుర్ధ స్థానంలో బృహస్పతి , శని తను స్థానం నందు , రాహువు ద్వితీయ స్థానం నందు,  కేతువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు..

READ MORE  Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: ధనస్సు రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

Ugadi Panchangam Kumba Rashi Phalalu : శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయానికి మించిన వ్యయం కలుగును. అకారణ కలహాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. శరీర స్థానంలో శని ఉండడంవల్ల అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు తద్వారా ఔషధ సేవ చేయవలసి వస్తుంది. ఇతరుల విషయాలలో తల దూర్చడం వల్ల అవమానములను ఎదుర్కోవలసి వస్తుంది.

విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. Schools లేదా Instutions నడిపే వారికి కొంత ఇబ్బందులు ఉండును. Administration, Bank ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలము. శరీరంలో దాగి ఉన్న అనారోగ్య సమస్యలు నిర్ధారణ కాకపోవడం ఒక సమస్యగా మారుతుంది. Oil, Stationary వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. Real estate వ్యాపారస్తులకు అధిక పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఆలస్యాన శుభ ఫలితాలు ఉండును. Court కేసుల యందు మొదట ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరకు విజయం సాధిస్తారు. భూమికి సంబంధించిన తగాదాలు తగ్గుముఖం పడతాయి . ఈ రాశి స్త్రీలకు గర్భానికి సంబంధించిన ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కలవు.

READ MORE  Ugadi Panchangam | క్రోధి నామ ఉగాది పంచాంగం: మిథున రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

క్రోధి నామ ఉగాది పంచాంగం: మకర రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..

రాజకీయ రంగంలో ఉన్నవారు చెయ్యని తప్పుకి అపనిందలు పడవలసి వస్తుంది. Chit Fund వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకునే అవకాశాలు కలవు. గృహంలో Civil works కొరకు ధన వ్యయం చేస్తారు. జీవిత భాగస్వామితో తగాదాలకు దిగడం అంత మంచిది కాదు. జమానతు సంతకాల జోలికి పోకూడదు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కొంత ఆలస్యాన వీసా మంజూరు అవుతుంది . ప్రయాణాలలో అనారోగ్య సమస్యలు వచ్చును. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబ సభ్యుల సలహా కోరుతారు. అధిక ఖర్చులు చేయకుండా ధనాన్ని పొదుపు చేసుకోవాలి. శరీరానికి గాయాలు అయ్యే అవకాశాలు కలవు కాబట్టి స్త్రీలు వంట చేసేటప్పుడు మరియు పురుషులు వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఏలినాటి శనికి, రాహువు, కేతువులకు సంబంధించిన గ్రహ జపములు చేయించి తగు దానములు ఇవ్వవలెను. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం,  మన్య సూక్త హోమం నిర్వహించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు.

READ MORE  August 6, 2023: ఆదివారం తిథి, శుభ ముహూర్తం, రాహుకాలం వివరాలు

by

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..