Meena Rashi Phalalu 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: మీన రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..
Meena Rashi Phalalu 2024 | హిందూ కాలమానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొదలవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి (Pisces Zodiac) వారికి ఎలా ఉండబోతున్నది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు.
- ఆదాయము – 11
- వ్యయము – 5
- రాజపూజ్యము – 2
- అగౌరవము – 4
ఈ సంవత్సరము మీన రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతము వరకు తృతీయ స్థానంలో బృహస్పతి , శని ద్వాదశ స్థానము నందు , రాహువు తను స్థానము నందు మరియు కేతువు సప్తమ స్థానమునందు సంచారము.
Ugadi Panchangam Meena Rashi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరము నందు మీన రాశి (Pisces Zodiac) వారికి మంచి మనసుతో సేవా కార్యక్రమములకు ధనాన్ని ఖర్చు చేస్తారు. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల అపమృత్యు దోషము కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.
విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కలవు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి స్థానచలనము కలిగే అవకాశాలు కలవు. రక్షణ శాఖ మరియు Navy ఉద్యోగస్తులకు పనిభారం అధికంగా ఉంటుంది. Electricity department, Agriculture department ఉద్యోగస్తులకు అధిక శ్రమ చేయవలసిన సమయం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి నిరాశ ఎదురవుతుంది. తరచూ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. Travel Agencies మరియు Granite వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది.
బంగారం, వెండి మరియు Emitation Jewellery వ్యాపారస్తులకు నష్టములు కలిగే అవకాశాలు కలవు. నూతన వ్యాపారం పెట్టుబడులు పెట్టడానికి ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. దేవాలయ నిర్మాణానికై కొంత ధనాన్ని విరాళంగా ఇస్తారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఆలస్యాన శుభ ఫలితాలు ఉండును. స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉండును.
క్రోధి నామ ఉగాది పంచాంగం: కుంభ రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..
రాజకీయ రంగంలో ఉన్నవారికి గడ్డు కాలము. పాల వ్యాపారస్తులకు నష్టాలు కలుగును. నూతన వధూవరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కలవు కాబట్టి కొంత సమన్వయంతో ఉండవలసిందిగా చెప్పదగిన సూచన. Real Estate వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. పైరవీల ద్వారా ఉద్యోగాన్ని పొందవలసి వస్తుంది. వాహనపరమైన గండాలు ప్రమాదాలు జరిగే అవకాశాలు కలవు. తండ్రితో స్థిరాస్తి విషయమై మనస్పర్ధలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చును. మితిమీరిన మంచితనం మిమ్మల్ని బాగా ఇబ్బందులకు గురిచేస్తుంది. అంచనాలు తప్పే అవకాశము కలదు. విశ్వాస పాత్రులు దూరమవుతారు. కుటుంబంలోని విషయాలు మరియు రహస్యాలు ఇతరులకు తెలిసే అవకాశం కలదు. కొన్ని సందర్భాలలో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటారు. జూదము మరియు చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతారు. స్త్రీలతో తగాదాలు అంత మంచిది కాదు. శరీరం బరువు ఎక్కకుండా చూసుకోవాలి. శని రాహువు మరియు కేతువు గ్రహముల జపము చేయించి తగు దానములు ఇవ్వవలెను. అఘోర మహా పాశుపత హోమము తప్పనిసరిగా నిర్వహించవలెను.
by
స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ
7730023250, 8978510978
Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..