Friday, March 14Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Manipur violence : మణిపూర్‌ వైరల్ వీడియో రికార్డు చేసిన వ్యక్తి అరెస్ట్

Manipur violence : మణిపూర్‌ వైరల్ వీడియో రికార్డు చేసిన వ్యక్తి అరెస్ట్

Trending News
కేసును సీబీఐకి అప్పగించే ఛాన్స్ Manipur violence : మణిపూర్ భయానక లైంగిక వేధింపుల కేసులో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దారుణమైన వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.నివేదికల ప్రకారం.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) వైరల్ వీడియో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి రిఫర్ చేసే అవకాశం ఉంది. వైరల్ వీడియో కేసు విచారణను మణిపూర్ వెలుపల జరపాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేయనుంది. పొరుగు రాష్ట్రమైన అస్సాంలో విచారణ జరిగే అవకాశం ఉంది.కుకీ, మెయిటీ గ్రూపులతో చర్చలు మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి కుకీ, మెయిటీ గ్రూపులతో MHA సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి."కేంద్రం కుకీ,...
గేదెను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చిన రైతు

గేదెను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చిన రైతు

Trending News
అసలు కారణం ఏమిటీ? ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక రైతు తన గేదె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. అక్కడ తన గేదెను కట్టివేసాడు. తన గేదెపై జరిగిన దాడి గురించి వివరిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తిర్వా కొత్వాలి ప్రాంతంలోని అహెర్ గ్రామానికి చెందిన సంతోష్ తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. గ్రామంలోని ఒక రైతుకు చెందిన పొలంలో మొక్కజొన్నచేనును ఈ గేదె కొద్ది మొత్తంలో తినేసింది. దీంతో ఆ రైతు గేదెను ముళ్ల తీగతో కట్టేసి  తీవ్రంగా కొట్టాడు.విషయం తెలుసుకున్నగేదె యజమాని సంతోష్ ఎలాగోలా తన గేదెను విడిపించుకున్నాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. బాధిత రైతు తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపాడు. తన గేదె  మేత కోసం వెళ్తూ వినయ్ అనే రైతు తన పొలంలో మొక్కజొన్నను తినేసిందని చెప్పాడు. ఇద...
Manipur violence: మణిపూర్ ఘటనలో ఆరో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

Manipur violence: మణిపూర్ ఘటనలో ఆరో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

Trending News
Manipur violence: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనకు సంబంధించి మరో నిందితుడిని మణిపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ మెటీ (Yumlembam Nungsithoi Metei )(19) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దేశాన్ని కుదిపేసిన ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో నలుగురు వ్యక్తులను శుక్రవారం 11 రోజుల పోలీస్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.మణిపూర్‌లోని కాంగ్‌పోక్పిలో మణిపూర్‌లో పోరాడుతున్న ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చేస్తున్నట్లు చూపించే వీడియో బుధవారం బయటపడి యావత్ భారతావనిని షాక్ గురిచేసింది. ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ సంఘటన జరిగింది. 26 సెకన్ల వీడియో జూలై 19న వెలువడిన ఒక రోజు తర్వాత గురువారం అరెస్టులు మొద...
మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు

మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు

National, Trending News
Manipur Shocking incident : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన భయానక ఘటనలో కీలక  నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుడు హెరాదాస్ (32) అనే వ్యక్తిని తౌబాల్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు, అందులో అతను ఆకుపచ్చ టీ-షర్టు ధరించి ఉన్నాడు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్  అయింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మణిపూర్‌ రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ తీవ్రంగా స్పంచారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయం దేశానికే సిగ్గుచేటని అన్నారు. అమానవీయ ఘటనకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందిస్తూ ప్రభుత్వం నిందితులకు "మరణశిక్ష" విధించే...
కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ

కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ

Trending News
తమిళనాడులో హృదయవిదారక ఘటన సృష్టిలో తల్లి ప్రేమ మందు ఏదీ సాటిరాదు. తన పిల్లల కోసం ఏం చేయడానికైనా మాతృమూర్తులు వెనుకాడరు. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేస్తారు. తన కొడుకు కాలేజీ ఫీజులను సమకూర్చేందుకు ఓ మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు కింద పడి ప్రాణాలను తీసుకుంది. పిల్లల ఫీజుల కోసం తనను తాను చంపుకోవడం హృదయాలను కలిచివేసింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన దృశాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.తమిళనాడులో ఓ మహిళ తన కుమారుడి చదువు కోసం డబ్బు సమకూర్చేందుకు బస్సు కిందకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. సేలం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో 'సఫాయి కర్మచారి' (క్లీనింగ్ స్టాఫ్)గా పనిచేస్తున్న ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు ముందు దూకినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది.యాక్సిడెంట్‌లో చనిపోతే తన...
పారిపోయిన వధువు కోసం వరుల వేట

పారిపోయిన వధువు కోసం వరుల వేట

Trending News
దాదాపు 27 మందిని వివాహం చేసుకున్న కిలేడీ డబ్బు, బంగారంతో పరారీ జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ మహిళ 27 మందిని పెళ్లి చేసుకొని వారి వద్ద నుంచి  బంగారం, డబ్బు దోచుకుని పారిపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనగర్ లాల్ చౌక్ ప్రెస్ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు అవ్రత్ అనే మహిళ తమను వివాహం చేసుకుందని, ఆపై తమతో కొంతకాలం గడిపిన తర్వాత బంగారం, డబ్బుతో పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన బుద్గామ్ జిల్లాలో జరిగింది. .శ్రీనగర్ లాల్‌చౌక్‌లోని సితిత్ ప్రెస్ కాలనీలో కొందరు బాధితుల కథనం ప్రకారం.. జమ్మూ డివిజన్‌లోని రాజౌరి ప్రాంతానికి చెందిన మహిళ కొందరు మారేజ్ బ్రోకర్స్ తో కలిసి ముఠాగా ఏర్ప్డడ్డారు. సాధారణంగా ధనవంతులు లేదా పెద్ద మోత్తంలో కట్నాలు ఇచ్చేవారిని టార్గెట్ చేశారు. బద్గామ్ ఖాన్ సాహెబ్‌ ప్రాంతానికి చెందిన బాధితుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం ఒ...
మసాలా దోసతో సాంబార్ వడ్డించనందుకు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా

మసాలా దోసతో సాంబార్ వడ్డించనందుకు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా

Trending News
బీహార్ లోని ఒక రెస్టారెంట్ కు రూ. 140 విలువైన స్పెషల్ మసాలా దోస అర్డర్ వచ్చింది. అయితే దోసతోపాటు సాంబార్ సర్వ్ చేయని కారణంగా సదరు రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్ కు రూ. 3,500 చెల్లించాల్సి వచ్చింది.బీహార్ లోని బక్సర్ లోని ఒక రెస్టారెంట్ లో దోసతో సాంబార్ లేకుండా వడ్డించారు. దానికి బదులుగా సూప్ ను సర్వ్ చేశారు. ఈ స్పెషల్ మసాలా దోస ధర రూ. 140 వసూలు చేశారు. అయితే రెస్టారెంట్ ఇప్పుడు పెనాల్టీగా రూ.3,500 చెల్లించాల్సి వచ్చింది. సాంబార్ చట్నీ దోసెలతో వడ్డించడం ఒక విధమైన ఆచారం. ఒక కస్టమర్ దానిని కోర్టుకు లాగడంతో రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా విధించారు. పిటిషనర్ కు దోసతో సాంబార్ వడ్డించకపోవడం వల్ల కస్టమర్ "మానసికంగా, శారీరకంగా ఆర్థికంగా" నష్టపోయాడని వినియోగదారుల కోర్టు పేర్కొంది. జరిమానా చెల్లించేందుకు నమక్ రెస్టారెంట్ కు 45 రోజుల గడువు ఇచ్చింది. రెస్టారెంట్ జరిమానా చెల్లించకుంటే జరిమానా మొత్త...
వ్యక్తిపై మూత్రం పోసిన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య

వ్యక్తిపై మూత్రం పోసిన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య

Trending News
మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలపై మంగళవారం అర్ధరాత్రి అరెస్టు అయిన ప్రవేశ్ శుక్లా(30) నివాసంలో కొంత భాగాన్ని అధికారులు బుధవారం బుడ్డోజర్లతో కూల్చివేశారు. సిద్ధి జిల్లాలో పోలీసు బృందాలు తనిఖీలు చేసి శుక్లాను అరెస్టు చేశాయి. అతని అరెస్టు తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ సాకేత్ మాల్వియా.. శుక్లాపై జాతీయ భద్రతా చట్టం(NSA) కింద కేసు నమోదు చేశారు.NSAని అనుసరించి, బుధవారం బుల్డోజర్లు శుక్లా ఇంటికి చేరుకున్నాయి. ఇల్లు కూల్చివేయొద్దని శుక్లా తండ్రి, ఇతర కుటుంబ సభ్యులకు విన్నవించినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, అతని కుటుంబాన్ని, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకోవద్దని కుటుంబ సభ్యులు కోరారు. ఆ వీడియో నకిలీదని, "మమ్మల్ని ట్రాప్ చేయడానికి కుట్ర" జరిగిందని అతని తండ్రి పేర్కొన్నారు. "మా అబ్బాయి అలా చేయలేడు," అని అతను అధికారులకు మొరపెట్టుకున్నాడు. క...
‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..

‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..

Entertainment, Trending News
‘వందేమాతరం’.. పాటతో మార్మోగిన స్టేడియం.. శాఫ్ చాంపియన్‍షిప్ ఫైనల్‍లో భారత్ గెలిచిన తర్వాత స్టేడియంలోని వేలాది మంది మా తుఝే సలాం పాట పాడారు. ఈ వీడియోలు వైరల్‍గా మారాయి. సౌత్ ఏషియన్ ఫుల్‍బాల్ ఫెడరేషన్ (SAFF- శాఫ్) చాంపియన్‍షిప్ టోర్నమెంట్ టైటిల్‍ను ఇండియా ఫుల్‍బాల్ జట్టు 9వ సారి గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఈ ఫైనల్‍లో కువైట్‍పై పెనాల్టీ షూటౌట్ లో గెలిచి మరోసారి శాఫ్ విజేతగా అవతరించింది టీమిండియా . మ్యాచ్ సమయంలో 1-1తో రెండు జట్లు సమానంగా నిలవగా... తర్వాత పెనాల్టీ షూ టౌట్ జరిగింది. ఇందులో 5-4తో భారత జట్టు ఘన విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీకంఠీరవ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగిం ది. టీమిండియా గెలుపొందగానే స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు ‘‘మా తుఝే సలాం’’ అనే పాటను ముక్తకంఠంతో పాడారు. వందేమాతరం అంటూ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్...
ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..

ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..

Trending News
మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయింది.. సూరత్ కు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఉండేందుకు తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయ్యింది. సంచలనం రేపిన ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో ఓ మహిళ నయన మాండవి.. తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆపై తన కొడుకు కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత, ఆమె "తప్పిపోయిన" బిడ్డ కోసం పోలీసులు వరుసగా మూడు రోజులు వెతికినప్పటికీ, చిన్నారి ఆచూకీ లభించలేదు.పోలీసుల విచారణలో చిన్నారి తల్లిపై అనుమానం కలిగింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.సూరత్ లోని దిండోలి ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో నయన మాండవి కూలీగా పనిచేస్తోంది. తన రెండున్నరేళ్ల కుమారుడు వీర్ మాండవి అదృశ్యంపై ఫిర్యా...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?