
Gold and Silver Price Today : తగ్గుతున్న ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇవీ..
Gold and Silver Price Today : జూలై నెల ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఆగస్టు ప్రారంభం నుంచి తగ్గుముఖం పడుతూవస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,700 పలికింది. అయితే తాజాగా ఈ ధర రూ. 54,100 వద్ద కొనసాగుతోంది. గత నెలరోజులుగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 73,300 గా ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శుభముహూర్తాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. దీనికితోడు వరుసగా పండుగలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లకు మహిళలు మొగ్గు చూపుతున్నారు.
హైదరాబాద్‌లో స్థిరంగా బంగారం ధర..
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంది. గత మూడు రోజులుగా ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 54,100 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు...