Mizoram | మిజోరంలో త్వరలో మొట్టమొదటి రైల్వే స్టేషన్
Mizoram Railway Network: : భారతీయ రైల్వే పటంలో కొత్తగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరం కూడా చేరబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న మిజోరంలో బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు. దీంతో మిజోరంను దేశ రైల్వే మ్యాప్‌లో చేరనుంది. శుక్రవారం ఐజ్వాల్‌లో జరిగిన మిజోరం పోలీస్ సర్వీస్ అసోసియేషన్ (MPSA) సమావేశంలో ముఖ్యమంత్రి లాల్దుహోమా ఈ ప్రకటన చేశారు.మిజోరం రాష్ట్రానికి రైల్వే కనెక్టివిటీని పెంచడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యేలా చేసే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. ప్రధాని మోదీ సెప్టెంబర్ 12న మిజోరం చేరుకుని ఇక్కడ రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఆయన కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభిస్తారు.రాజధానికి రైలు సర్వీసులు : ముఖ్యమంత్రిప్రధాని పర్యటన గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడానని ముఖ్యమంత్...