Trains Cancelled in Secundrabad | రైల్వే అభివృద్ధి పనులు, మరమ్మతుల కారణంగా పలు మార్గాల్లో 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే గురువారం ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీ నుంచి అక్టోబర్ నెల 31వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని, ప్రయాణికులు గమనించాలని సూచించింది. కాచిగూడ-మెదక్ రైలు (07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది.
రద్దయిన రైళ్ల జాబితా ఇదే..
- కాచిగూడ-నిజామాబాద్(07596),
- నిజామాబాద్-కాచిగూడ(07593),
- మేడ్చల్-లింగంపల్లి(47222),
- లింగంపల్లి-మేడ్చల్ (47225),
- మేడ్చల్-సికింద్రాబాద్(47235),
- సికింద్రాబాద్-మేడ్చల్ (47236),
- మేడ్చల్-సికింద్రాబాద్(47237),
- సికింద్రాబాద్-మేడ్చల్(47238)
- మేడ్చల్-సికింద్రాబాద్(47242),
- సికింద్రాబాద్-మేడ్చల్(47245),
- మేడ్చల్-సికింద్రాబాద్(47228),
- సికింద్రాబాద్-మేడ్చల్ (47229)
కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
Special Trains : మరోవైపు దసరా, దీపావళి పర్వదినాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్, కాచిగూడ జంక్షన్ల నుంచి తిరుపతికి అక్టోబరు 1వ తేదీ నుంచి నవంబరు 16 వరకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ రైళ్లు సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైళ్లు జనగామ, వరంగల్ మార్గంలో.. కాచిగూడ-తిరుపతి ప్రత్యేక రైళ్లు ఉందానగర్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల మార్గంలో నడుస్తాయి. ఆయా మార్గల్లోని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- కాచిగూడ-సికింద్రాబాద్(07063) 7 సర్వీసులు, తిరుపతి-కాచిగూడ(07064) 7 సర్వీసులు,
- సికింద్రాబాద్-తిరుపతి(07041) 14 సర్వీసులు, తిరుపతి-సికింద్రాబాద్(07042) 14 సర్వీసులు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..