Dussehra 2023: దసరాకి రావణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు.. ఆయను నివాళులర్పించే ప్రజలు ఉన్నారు.. ఎందుకో తెలుసా..
Dussehra 2023 : పురాణాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమబుద్ధ నగర్ సమీపంలోని బిస్రఖ్ అనే గ్రామం రావణుడి జన్మస్థలంగా భావిస్తారు. ఆ గ్రామంలో ప్రజలు దసరా పండుగను సంతోషంగా జరుపుకోరు.. ఎందుకంటే వారికి రావణుడిపై చాలా నమ్మకం.. ఆయన్ను గొప్ప జ్ఞానిగా, శివ భక్తుడిగా భావించి పూజిస్తారు. దసరా రోజున ఇక్కడి ప్రజలు రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ రోజంతా పూజిస్తారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగే.. విజయదశమి లేదా దసరా.. ఈ ఏడాది 24 అక్టోబరు 2023న జరుపుకుంటారు. హిందువులు దసరా పండగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి. ఈ పండుగ రావణుడి లంకపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా.. రావణుడి మరణానికి సంబంధించినదిగా నమ్ముతారు. త్రేతాయుగంలో ఆశ్వియుజ శుక్లపక్షం 10వ రోజున రాముడు రావణుడిని వధించి సీతను అతడి బారి నుంచి విడిపించాడని నమ్ముతారు. ఈ సంతోషంతోనే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రావణ దహనాన్ని చేపడతారు. అయితే కొన్నిచోట్ల మాత్రం రావణుడి మరణానికి సంతాపం తెలుపుతారు. రామునికి బదులుగా రావణుడిపై తమ భక్తిని చాటుకునే ప్రజలు.. ఆ గ్రామం ఎక్కడ ఉందో ఈ రోజు తెలుసుకుందాం.Ravana Temples
జోధ్‌పూర్‌లో రావణుడికి సంతాపం?
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని మండోర్ గ్రామంలో లంకాధిపతి రావణుడు మండోదరిని వివాహం చేసుకున్నాడు. శ్రీమాలి సామాజిక వర్గానికి చెందిన గోదా గోత్ర ప్రజలు.. రావణుడి కల్యాణ ఊరేగింపులో ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్లలేదని అప్పటి నుంచి ఇక్కడే స్థిరపడినట్లు నమ్ముతారు. ఇక్కడ నివసించే శ్రీమాలి కమ్యూనిటీ ప్రజలు తమను తాము రావణుడి వారసులుగా భావిస్తున్నారు. రావణుడు మండోదరిని ఆరాధిస్తారు. అటువంటి పరిస్థితిలో దసరా పండుగ వేళ రావణ దహనంలో పాల్గొనడానికి బదులుగా.. ఈ తెగకు చెందిన ప్రజలు రావణాసుర మరణానికి సంతాపం తెలుపుతారు.
కర్ణాటకలో రావణుడికి పూజలు..
కర్ణాటకలోని మాండ్య, కోలార్ ప్రాంతాల్లో రావణుడి వధ వేడుకలకు దూరంగా ఉంటారు. పైగా రావణాసురిడికి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఎందుకంటే ఇక్కడ నివసించే ప్రజలు రావణుడు గొప్ప శివ భక్తుడు అని.. అందుకే అతడిని దహనం చేయవద్దు.. పూజించాలని నమ్ముతారు. దసరాకు ఇక్కడ ప్రజలు పూర్తి నియమనిష్టలతో రావణుడికి పూజలు చేస్తారు.
దసరా జరుపుకోని బిస్రాఖ్ గ్రామం
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ సమీపంలోని బిస్రఖ్ అనే గ్రామం రావణుడి జన్మస్థలంగా భావిస్తారు. అందుకే స్థానిక ప్రజలు దసరా పండుగను ఇక్కడ జరుపుకోరు.. ఎందుకంటే వీరికి రావణాసురుడిపై భక్తివిశ్వాసాలు ఎక్కువ. అతన్ని గొప్ప జ్ఞానిగా భావించి పూజలు చేస్తారు. దసరా రోజున ఇక్కడి ప్రజలు రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ ఆ రోజు మొత్తం పూజిస్తారు.
రావణుడి మరణానికి మందసౌర్‌లో సంతాపం
ఇక మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో కూడా రావణుడిని దహనం చేయకుండా పూజిస్తారు. ఎందుకంటే ఇక్కడ నివసించే ప్రజలు ఈ స్థలాన్ని రావణుడి అత్తగారిల్లుగా భావిస్తారు. మండోదరి పూర్వీకుల ఇల్లు ఇక్కడే ఉందని స్థానికులు నమ్ముతారు.. అందుకే దసరా రోజున రావణాసురిడిని దహనం చేయకుండా అతని మరణానికి సంతాపం తెలుపుతారు.
150ఏళ్ల పురాతన రావణుడి దేవాలయం(Ravana Temples)
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో 150 సంవత్సరాల నాటి పురాతన రావణుడి ఆలయం ఉంది. ఇది విజయదశమి రోజున పూజ కోసం మాత్రమే తెరుస్తారు. విజయదశమి రోజున ప్రజలు రావణుడిని ఆచారాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. రావణ దహనానికి ముందు ఈ ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. సంవత్సరానికి ఒకసారి తెరుచుకునే ఈ ఆలయంలో రావణుడి పూజలో తామర పువ్వులు సమర్పించే సంప్రదాయం ఉంది.
Top Ten Ravana Temples in India
1- Dashanan Temple, Kanpur (Uttar Pradesh)
2- Ravana Mandir, Bisrakh, (Greater Noida, UP)
3- Kakinada Ravana temple, Andhra Pradesh.
4- Ravangram Ravana Temple, Vidisha (Madhya Pradesh)
5- Mandsaur (Madhya Pradesh)