TGSRTC | టీజీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఇక డిజిటల్ టికెట్లు.. త్వ‌ర‌లో న‌గ‌దు రహిత లావాదేవీలు..

TGSRTC | టీజీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఇక డిజిటల్ టికెట్లు.. త్వ‌ర‌లో న‌గ‌దు రహిత లావాదేవీలు..

TGSRTC Digital Tickets : తెలంగాణ ఆర్టీసీ బ‌స్ టికెట్ల జారీ విష‌యంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సిటిజన్ ఫ్రెండ్లీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) త్వరలో డిజిటల్‌గా మారనుంది.

డిజిటల్ టికెట్ల విష‌యంలో గతంలో పైలట్ రన్ చేప‌ట్ట‌గా  అపూర్వ స్పందన వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) సాఫ్ట్‌వేర్‌తో కూడిన i-TIMS (ఇంటెలిజెంట్ టిక్కెట్ ఇష్యూ మెషిన్)ని అన్ని రకాల బస్సుల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఈ టెక్నాల‌జీ సాయంతో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, క్యూఆర్ కోడ్, యూపీఐ సాయంతో అత్యంత సులభంగా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.

ఆర్టీసీ ప‌రిధిలో వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్‌

TGSRTC ఫ్లీట్ అంతటా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తోంది. హైదరాబాద్‌లోని బండ్లగూడ డిపో పరిధిలో దాదాపు 80 బస్సులతో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రహదారిపై పైలట్ ప్రాతిపదికన ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. దీని ప్రకారం.. బస్సు కండక్టర్లకు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు అందజేశారు. ఈ యంత్రాల పనితీరును ఆర్టీసీ అధికారులు పరిశీలించగా టికెట్‌ జారీ చేసే సిబ్బంది నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవ్వలేదు. అందుకే, అన్ని బస్సుల సిబ్బందికి ఈ యంత్రాలను అంద‌జేయాల‌ని నిర్ణయించారు.

READ MORE  7 ఏళ్ల క్రితం గుడిలో చోరీ అయిన మీ బూట్లను గుర్తించడానికి స్టేషన్ కు రండి.. ఫిర్యాదుదారుడికి పోలీసుల ఫోన్

బస్సుల్లో చిల్లర డబ్బుల సమస్యకు చెక్..

చాలా కాలంగా బస్సు సిబ్బందితో పాటు ప్రయాణికులు టికెట్ కు సరిప‌డా చిల్ల‌ర లేక చాలా ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిల్లర డ‌బ్బులు తీసుకురావాల‌ని ప్ర‌త్యేకంగా అన్ని బస్సుల్లో కొటేష‌న్లు రాసి ఉండ‌డం మ‌నం చూస్తేనే ఉన్నాం.. బస్సు దిగాక ఇద్ద‌రు ముగ్గురు ప్ర‌యాణికుల‌కు క‌లిపి చిల్లర పంచుకోమ‌ని కండ‌క్ట‌ర్లు పెద్ద‌నోట్లు ఇస్తుంటారు. ఈ చిల్ల‌ర‌ నగదు కొరతపై ప్రయాణికుల నుంచి ఏళ్ల తరబడి ఫిర్యాదులు వ‌స్తూనే ఉన్నాయి.

TGSRTC Digital Tickets : ఈ నేప‌థ్యంలోనే హైదరాబాద్ సిటీ పరిధిలోకి వచ్చే బస్సుల్లో నగదు రహిత లావాదేవీలను ప్రవేశపెట్టాలని TGSRTC యోచిస్తోంది. బస్సులతో పాటు బస్ స్టేషన్లలో కూడా ఆండ్రాయిడ్ ఆధారిత మెషిన్లు పనిచేస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్ పాస్ కౌంటర్లలో కూడా విద్యార్థులు, సాధారణ పాస్‌ల ఆన్‌లైన్ లావాదేవీల పునరుద్ధరణ కోసం స్వైపింగ్ మిషన్లను అమర్చారు.

READ MORE  Rains fall | మండుటెండల్లో చల్లని కబురు.. తెలంగాణలో వ‌ర్షాలు..

బస్సులు బయలుదేరడానికి కనీసం 15 నిమిషాల ముందు ప్రయాణీకులు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అవ‌కాశం ఉంటుంది. ఈ విధానం వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవడమే కాకుండా బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో ముందుగానే తెలుసుకునే చాన్స్‌ ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.

AC, లగ్జరీ, ఈ-బస్సుల కోసం గమ్యం యాప్

అధికారులు TGSRTC గమ్యం యాప్‌తో అన్ని లగ్జరీ, ఎయిర్ కండిషన్డ్, ఎలక్ట్రిక్ బస్సు సేవలను కవర్ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ యాప్ గత ఏడాది ప్రారంభించబడినప్పటికీ, ఇది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) రూట్‌లోని ఎలక్ట్రిక్ బస్సులలో మాత్రమే అమ‌లు చేశారు. అయితే
TGSRTC గమ్యం బస్ ట్రాకింగ్ యాప్ ప్ర‌యాణికుల నుంచి మంచి స్పందన వ‌చ్చింది. ఒక సంవత్సరంలోనే 10 లక్షలకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ డ్రైవర్.. కండక్టర్ వివరాలతో పాటు, నిర్ణీత సమయంలో రూట్‌లో అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను వెల్ల‌డిస్తుంది. అలాగే బస్సు బ‌య‌లుదేరే స్థానం, గమ్యస్థానాల వివ‌రాల‌ను తెలుపుతుంది. ఈ యాప్ Google Play Storeలో అందుబాటులో ఉంది. TGSRTC అధికారిక వెబ్‌సైట్ www.tgsrtc.telangana.gov.in నుండి కూడా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు .

READ MORE  Rain forecast | మరో రెండు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *