పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్
ఇకపై ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డే....
వివరాలు ఇవీ..
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల(Telangana Schools)కు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. ముందుగా ఊహిచినట్లే.. జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి వర్కింగ్ డేగా నిర్ణయించింది. ఇక నుంచి తెలంగాణలో పాఠశాల పిల్లలకు ప్రతి నెలలో నాలుగవ శనివారం నో బ్యాగ్ డే అని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు అంటే ఆరోజు పిల్లలకు పుస్తకాల నుంచి విముక్తి కలుగుతుంది. రోజంతా ఆటపాటలు ఉత్సాహంగా గడపనున్నారు. మరోవైపు వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలను తప్పనిసరి చేశారు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు పుస్తకాలు చదివించడంతోపాటు 5 నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానం చేయించాలని నిర్ణయించారు. ఇక పదో తరగతి సిలబస...