భారీ వర్షాలతో తెలంగాణ విలవిల
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారని సమాచారం.మూడు రోజుల రెడ్ అలర్ట్ తర్వాత, వాతావరణ శాఖ అనేక జిల్లాల్లో హెచ్చరిక స్థాయిని 'ఆరెంజ్' అలర్ట్ కు తగ్గించింది. గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో లక్ష్మీదేవిపేట (ములుగు జిల్లా), చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి)లో వరుసగా 64.98 సెం.మీ, 61.65 సెం.మీ వర్షపాతం నమోదైంది.నివేదికల ప్రకారం, గురువారం భారీ వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఎనిమిది మంది వ్యక్తులు వేర్వేరు సంఘటనలలో మరణించారు. మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పి.యాకయ్య, పి శ్రీనివాస్ వాగులో కొట్టుకుపోగా, హనుమకొండలో లైవ్ వైరు తగిలి ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కరీంనగర్‌కు చెందిన ఎం.వెంకటేష్ (23) సబితం జలపాతంలో జారిపడి గల్లంతయ్యాడు. హనుమకొండలోని గోపాలపూర్‌కు చెందిన జి రాజు నీటిలో కొట్టుకుప...