తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు..500 గ్యాస్ కి ఓకే..
తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు, రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రచించిన సుప్రసిద్ద గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఎంపిక చేసింది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి( RevanthReddy) అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ ను టీజీ (TG) గా మార్చాలని తీర్మానించింది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది..
తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు
తెలంగాణ (Telangana) తల్లి విగ్రహం ఒక వ్యక్తిని ఊహించుకునేలా ఉందని, అందుకే కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.. రాష్ట్ర గీతంగా అందెశ్రీ జయ జయహే తెలంగాణను ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌ను TG గా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. గత పాలకులు తమ పార్టీ పేరును పోలేలా ఉండేలా టీఎస్ పెట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhra Babu) విమర్శించారు.
రాష్ట్రంలో కుల గణన
ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టాలని మంత్రివర్గం తీర్మానించింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై కేబినెట్.. సుదీర్ఘంగా చర్చించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి వర్గం సంతృప్తి వ్యక్తం చేసింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మరో రెండు కొత్త పథకాలను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించనున్నారు. రూ. 500 కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ ను త్వరలో అమలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించినట్లు తెలిసింది.. రాష్ట్రంలోని 65 ఐటీఐ (ITI) కళాశాలలను అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్స్ గా అప్ గ్రేడ్ చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాజేంద్రనగర్‌లో హైకోర్టుకు 100 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. ఖైదీలకు క్షమాభిక్ష కోసం ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటు కోసం తెలంగాణ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..