Praja Palana Applications Data Updates: ఆరు గ్యారెంటీ హామీల పథకాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం గతేడాది డిసెంబరు 28 నుంచి ప్రారంభమై జనవరి 6 వరకు కొనసాగింది. ఇందులో భాగంగా.. ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏకంగా కోటికి పైగా అర్జీలను స్వీకరించారు. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటి దరఖాస్తుల్లోని మొత్తం వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ చాలవారకు పూర్తికావొచ్చింది. తాజాగా సంక్రాంతి సెలవులు రావటంతో మూడురోజుల పాటు ఆగినప్పటికీ.. త్వరలోనే డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని సమాచారం.
కొత్త వెబ్ సైట్ ఇదే
Praja Palana Application Status : ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి సంబంధించి https://prajapalana.telangana.gov.in/ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఇందులో పూర్తి డేటాను ఎంట్రీ చేసేలా కసరత్తు చేస్తోంది. దరఖాస్తుదారుడి స్టేటస్ కూడా తెలుసుకునే వీలు కూడా కల్పించనుంది. అయితే ఇందులో భాగంగా.. వెబ్ సైట్ లో కీలక ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది
మొన్నటి వరకు వెబ్ సైట్ మాత్రం అందుబాటులోకి రాగా, తాజాగా ప్రజాపాలన వెబ్ సైట్ లో దరఖాస్తు ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు ‘‘KNOW YOUR APPLICATION STATUS’’ అనే ఆప్షన్ ను తీసుకొచ్చింది. దీని పై క్లిక్ చేస్తే వెంటనే అప్లికేషన్ నంబర్ (Online) అని కనిపిస్తుంది. దీంట్లో దరఖాస్తుదారుడి ఆప్లికేషన్ నెంబర్ ను నమోదు చేసి కింద Captcha ను పూర్తిచేయాలి. ఆ తర్వాత ‘‘View Status’’ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే దరఖాస్తు ఏ స్థితిలో ఉందనే విషయం కంప్యూటర్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. అయితే డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో ఈ వెబ్సైట్ అందుబాటులో వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పోర్టల్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..?అనే అంశాలను పరిశీలిస్తున్నారు.
భారీగా అప్లికేషన్లు
ఇక ఈ పోర్టల్ లోదరఖాస్తుదారుడు ఏ స్కీమ్ కు అర్హత సాధించారు? లేక ఏమైనా అప్లికేషన్ లో తప్పులు ఉన్నాయా? ఇంకా ఏమైనా వివరాలను సమర్పించాల్సి ఉంటుందా వంటి అంశాలు కూడా ఇందులో కనిపించే అవకాశం ఉంటుందని సమాచారం. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో, మళ్లీ నాలుగు నెలల తర్వాత ‘ప్రజా పాలన’ కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమయంలో మళ్లీ దరఖాస్తులను స్వీకరించనుంది.
‘ప్రజా పాలన’ కార్యక్రమంలో ప్రధానంగా ఇళ్లు, చేయూత, రేషన్ కార్డుల కోసం ఎక్కువగా దఖాస్తులు వచ్చాయి. తెల్లకాగితంపై కూడా దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పగా, ఎక్కువగా రేషన్ కార్డుల కోసమే అప్లికేషన్లు అందాయి. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ‘గృహలక్ష్మి’ దరఖాస్తులను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసిన నేపథ్యంలో వీరంతా తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చారు. అభయహస్తం కింద తీసుకున్న దరఖాస్తుల్లో మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత వంటి పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి స్కీమ్ కు మహిళలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..