Metro line in Old City: పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు.. కొత్త స్టేషన్లు ఎక్కడెక్కడంటే..
New Metro line in Old City | పాతబస్తీ వాసుల చిరకాల స్వప్నం నెరవేరేందుకు అడుగులు పడ్డాయి. ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మించనున్నారు. దీనికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో రైలు చిరకాల స్వప్నం. ఎన్నో కారణాల వల్ల ఇన్ని సంవత్సరాలుగా అక్కడ మెట్రో నిర్మాణం సాధ్యం కాలేదు. ఎన్నికలకు ముందే మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం పలు ప్రణాళికలను రూపొందించింది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు లైన్ నిర్మించాని భావించింది. దీంతో పాతబస్తీలో ప్లాన్లు పెండింగ్ లో పడిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాతబస్తీ మెట్రో ప్రణాళిక లో కదలిక వచ్చింది.మెట్రోలైన్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి.. మజ్...