Saturday, January 24Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Family Digital Card | ఇక‌పై ప్ర‌తీ కుటుంబానికి ఫామిలీ డిజిట‌ల్ కార్డు.. సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే..

Family Digital Card | ఇక‌పై ప్ర‌తీ కుటుంబానికి ఫామిలీ డిజిట‌ల్ కార్డు.. సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే..

Telangana, తాజా వార్తలు
Family Digital Card | రాష్ట్రంలోని ప్ర‌తీ కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఇందు కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. పైలట్ ప్రాజెక్టు అమ‌లు కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తోపాటు సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు జారీ చేయ‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మాదిరిగానే `వన్ స్టేట్ – వ‌న్ డిజిటల్ కార్డ్` విధానాన్ని తెలంగాణ‌లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ల‌బ్ధిదారులు ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకోనున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలు అందుతాయి. అందులో ప్రతీఒక్కరి హెల్త్ పొఫైల్ త‌ప్ప‌ని...
ప్ర‌యాణికుల‌కు TGSRTC గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో 70 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు

ప్ర‌యాణికుల‌కు TGSRTC గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో 70 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు

Telangana
TGSRTC Metro Delux Bus | హైదరాబాద్: ప్ర‌జ‌ల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న 55 ఫ్లీట్‌కు మరో మెట్రో డీలక్స్ బస్సులను ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఉప్పల్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, జగద్గిరిగుట్ట, ఎల్‌బీ నగర్ వంటి కీలక మార్గాల్లో 70 కొత్త బస్సులు సేవలందించ‌నున్నాయి. కొత్త మెట్రో డీలక్స్ బస్సులను హైదరాబాద్ అంతటా అధిక డిమాండ్ ఉన్న రూట్లలో న‌డిపించ‌నున్నారు. ఇక్కడ ఫ్రీక్వెన్సీని మెరుగుపరచడానికి బస్సులు 15-20 నిమిషాల వ్యవధిలో నడుస్తాయి. ప్రస్తుతం, ఈ RTC బస్సులు ఉప్పల్-మెహదీపట్నం, సికింద్రాబాద్-ECIL, కోఠి, అబ్దుల్లాపూర్‌మెట్‌లతో సహా ప్రధాన మార్గాలను కవర్ చేస్తాయి ఇవి నగర ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందించ‌నున్నాయి. మహిళా ప్రయాణికులు టికెట్ చెల్లించాల్సిందే.. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్‌లో క...
Special Trains | పండుగ వేళ గుడ్ న్యూస్‌.. మహబూబ్‌నగర్‌ – గోరక్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు!

Special Trains | పండుగ వేళ గుడ్ న్యూస్‌.. మహబూబ్‌నగర్‌ – గోరక్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు!

Telangana
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. గోరక్‌పూర్‌ – మహబూబ్‌నగర్‌ మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను అక్టోబర్‌లోనూ నడిపిస్తున్నట్లు పేర్కొంది. గోరక్‌పూర్‌ – మహబూబ్‌నగర్‌ (05303) మధ్య అక్టోబర్‌ 12, 19, 26 మధ్య ప్రతీ శనివారం స్పెష‌ల్ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయని వెల్ల‌డించింది.ఇక మహబూబ్‌నగర్‌ – గోరక్‌పూర్‌ (05304) మధ్య మీదుగా అక్టోబర్‌ 13, 20, 27వ‌ తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. రైలు జడ్చర్ల, షాద్‌నగర్‌, ఉమ్దానగర్‌, కాచిగూడ, మల్కాజ్‌గిరి, రామగుండం, బెల్లంపల్లి, నాగ్‌పూర్‌, ఇటార్సీ, భోపాల్‌, ఝాన్సీ, ఒరై, కాన్పూర్‌ సెంట్రల్‌, ఐష్‌బాగ్, బస్తీ స్టేషన్ల మీదుగా గోరక్‌పూర్‌కు రైలు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.అక్టోబర్‌ 21 నుంచ...
Cabinet Meeting | మరింత పవర్ ఫుల్ గా హైడ్రా.. భారీగా సిబ్బంది కేటాయించిన  సర్కారు..  

Cabinet Meeting | మరింత పవర్ ఫుల్ గా హైడ్రా.. భారీగా సిబ్బంది కేటాయించిన సర్కారు..  

Telangana
Telangana Cabinet Meeting | తెలంగాణ కేబినేట్ తీసుకున్న నిర్ణయాలతో  హైడ్రా (Hydra) మరింత పవర్ ఫుల్ గా మారింది. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.  169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్‌ ‌సిబ్బంది అప్పగించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ లో తీసుకున్న నిర్ణయాలను  మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి,  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విలేఖరులకు వెల్లడించారు.చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా హైడ్రా (Hydra)కు విస్త్రత అధికారాలు ఇచ్చారు. రైతులకు గుడ్ న్యూస్.. మరోవైపు ఎన్నికల హామీ మేరకు రైతులకు సన్న వడ్లపై రూ.500 బోనస్‌ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నుంచే  సన్న వడ్లపై బోనస్‌ ఇవ్వను...
Ration Card Application | కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సై..  వచ్చేనెల 2 నుంచి దరఖాస్తులు

Ration Card Application | కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సై.. వచ్చేనెల 2 నుంచి దరఖాస్తులు

Telangana
Ration Card Application |  ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర స‌చివాల‌యంలో గురువారం స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రేష‌న్ కార్డుల మంజూరుకు సంబంధించి మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. రేష‌న్ కార్డులు మంజూరుకు ప‌టిష్ట‌మైన‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూత‌న రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు 2వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ (Ration Card Application ) ను స్వీక‌రించాల‌ని సీఎం సూచించారు.అర్హులంద‌రికీ డిజి...
Dasara Holidays 2024 | విద్యార్థులకు గుడ్ న్యూస్..  దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా.. ?

Dasara Holidays 2024 | విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా.. ?

Telangana
Dasara Holidays 2024 | విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే వారి ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. ఈ సెప్టెంబరులో విద్యార్థులు చాలా రోజులు సెలవులు వచ్చాయి. మ‌రికొద్ది రోజుల్లో దసరా పండగ వ‌స్తోంది. దీంతో దసరా పండగ సెలవుల కోసం పిల్ల‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సెలవులు వ‌చ్చాయంటే చాలు హ్యాపీగా ఊళ్లకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ విజ‌య‌ద‌శ‌మి పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబరు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవుల‌ను ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమ‌వుతాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతితో సెలవులు మొద‌ల‌వుతాయి.ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వెల్ల‌డించారు. మ‌రోవైపు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ తేదీ నుంచి స్కూళ్లు ప్రా...
ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలపై కీలక ఆదేశాలు.. వచ్చే నెలలోనే ప్రారంభం!

ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలపై కీలక ఆదేశాలు.. వచ్చే నెలలోనే ప్రారంభం!

Telangana
Integrated Residential Schools  | రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాలల‌ ఏర్పాటుపై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క అడుగువేసింది. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగ‌ల్‌. డిప్యూటీ సీఎం నియోజ‌క‌వ‌ర్గం మ‌ధిర ప‌రిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల నిర్మాణ పనులను వచ్చే నెలాఖరులోపు ప్రారంభించాలని సిఎస్‌ ‌శాంతికుమారి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. గురువారం సచివాలయంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ‌పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మేనేజ్‌మెంట్‌ ‌కమిటీ తొలి స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. కొడంగల్‌, ‌మధిర నియోజకవర్గం, లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల (Integrated Residential Schools) నిర్మాణ పనులను వ‌చ్చే నెలాఖరులోనే ప్రారంభించాలని ఆదేశించారు. పరిపాలనా అనుమతుల కోసం ప్రత...
Telangana Temples | రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ.. రాయగిరిలో 20 ఎకరాల్లో వేద పాఠశాల

Telangana Temples | రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ.. రాయగిరిలో 20 ఎకరాల్లో వేద పాఠశాల

Telangana
తెలంగాణలో దేశంలోనే  రెండో అతిపెద్ద లింక్ బ్రిడ్జి  Telangana Temples  | రాష్ట్రంలోని దేవాలయాలకు మహర్దశ పట్టనుంది. వేములవాడ రాజరాజేశ్వరస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, కీసర రామలింగేశ్వరస్వామి, రామప్ప ఆలయాలతోపాటు ఇత‌ర ప్ర‌ధాన ఆల‌యాల అభ‌వృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించింది. ప్రముఖ దేవ‌స్థానాలు.. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామితి, యాదాద్రి దేవాలయ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్‌ ‌ప్లాన్ పై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ప‌లు కీల‌క విష‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. ‌రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా, చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని అటవీ, పర్య...
Internet facility | త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ .. ఈ మూడు గ్రామాలో తొలిసారి..

Internet facility | త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ .. ఈ మూడు గ్రామాలో తొలిసారి..

Telangana
Telangana | కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తెచ్చి ఇంటర్నెట్‌ కనెక్షన్ల (Internet facility) ను ఏర్పాటు చేయ‌నుంది. న్ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు( Minister Sridhar Babu) పేర్కొన్నారు. కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో  మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ని విస్తరించి 20 ఎంబీ స్పీడ్ ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించాలని రాష్ట్ర ఐటీ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సంగుపేట, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్‌, నారాయణపేట జిల్లా మద్దూరు గ్రామాలను ఫైలెట్‌ గా ఎంపిక చేసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ గ్...
Bhatti Vikramarka | నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. భూమిలేని వారి ఖాతాల్లో రూ. 12 వేలు.. ఈ ఏడాది నుంచే అమలు..!

Bhatti Vikramarka | నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. భూమిలేని వారి ఖాతాల్లో రూ. 12 వేలు.. ఈ ఏడాది నుంచే అమలు..!

Telangana
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి Khammam :  భూమిలేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.12 వేలు జ‌మ‌చేస్తామ‌ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రెండో విడత దళిత బంధు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా జ‌రిగిన‌ సభలో భ‌ట్టి మాట్లాడుతూ.. రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పరిపాలనలోకి వొచ్చింద‌ని, అందుకే త‌మ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని వివ‌రించారు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్న‌ట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ఇప్పటికే భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.ఆరు లక్షల...