గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్-3 ప‌రీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. వివరాలు ఇదిగో..

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్-3 ప‌రీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. వివరాలు ఇదిగో..

Telangana Group 2 Exam Date : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష తేదీలను బుధవారం గ్రూప్ పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రకటిచింది. ఆగస్టు 7, 8వ‌ తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న జ‌ర‌గ‌నుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 న ప్రారంభమ‌వుతాయి.

వయోపరిమితి పెంపు

తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్నా, ఒక్కసారి కూడా గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయ‌లేదు. గత నోటిఫికేషన్ ను రద్దు చేసి, మొత్తం 563 పోస్టుల భర్తీకీ టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన‌వారు గ్రూప్ -1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు తాజా నోటిఫికేషన్ కు ఎలాంటి ఫీజు కూడా చెల్లించన‌వ‌స‌రం లేదు. అభ్యర్థుల నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాగా గరిష్ఠ వయోపరిమితి 44 నుంచి 46 ఏళ్ల‌కు పెంచారు.

READ MORE  పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్

‘గ్రూప్-2’ నోటిఫికేషన్ వివరాలు

Telangana Group 2 Exam Date : గతంలోనే 783 ‘గ్రూప్-2’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను గ‌త ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. కానీ పరీక్ష తేదీలను వాయిదా వేస్తూ వచ్చింది. కాగా నవంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయగా.. ఎన్నికల షెడ్యూల్ వల్ల జ‌నవరిలో నిర్వహించేందుకు రీషెడ్యూల్ చేసింది. అంతలోనే ఎన్నికలు జ‌రిగ‌డం.. జగరిగడంతో ప్రభుత్వం మారిపోవ‌డం చ‌క‌చ‌కా జరిగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వ‌చ్చీ రాగానే టీఎస్ పీఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిన నియమించింది. ఈ క్రమంలో ఆగస్టు 7, 8వ‌ తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎంపీవో, ప్రొహిబిషన్ అండ్‌ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల నియామ‌కాలు చేప‌ట్ట‌నున్నారు.

READ MORE  Heat Waves | మూడు రోజులు ప‌లు జిల్లాల్లో వడగాలులు..! పలుచోట్ల వ‌ర్షాలు

గ్రూప్-3 పోస్టులు ఇవే..

తెలంగాణలో ‘గ్రూప్-3’ ఉద్యోగాల భర్తీకి టీఎస్ పీఎస్సీ చివ‌ర‌గా 2022 డిసెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1363 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను టీఎస్ పీఎస్సీ భర్తీ చేస్తుంది. గ్రూప్-3 పరీక్షలను నవంబర్ 17, 18వ‌ తేదీల్లో నిర్వహించ‌నున్నారు.

ముఖ్య తేదీలు:

  • గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల – ఫిబ్రవరి 19,2024.
  • ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం – ఫిబ్రవరి 23, 2024.
  • దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు – మార్చి 03,2024.
  • దరఖాస్తుల సవరణకు అవకాశం – మార్చి 23 నుంచి మార్చి 27,2024.

హాల్ టికెట్లు డౌన్లోడ్ – పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి.  కాగా అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ. 200 గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ. 120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఈ ఫీజు(ఎగ్జామినేషన్ ఫీజు) నుంచి మినహాయించారు.తెలంగాణ‌లోని 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నిర్వహించనున్నారు.

  • ప్రిలిమినరీ పరీక్ష – జూన్ 09 2024.
  • మెయిన్స్ పరీక్షలు – సెప్టెంబర్/ అక్టోబరు 2024.
  • ప్ర‌భుత్వ‌ అధికారిక వెబ్ సైట్ – https://www.tspsc.gov.in
READ MORE  SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేస‌విలో భారీగా ప్రత్యేక రైళ్లు ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..

 


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

2 thoughts on “గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్-3 ప‌రీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. వివరాలు ఇదిగో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *