Thursday, November 14Latest Telugu News
Shadow

TATA Motors | టాటా వాహనాలు ఎందుకు దృఢంగా ఉన్నాయి? కారణాలు ఇవే..!

TATA Motors | పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ సెగ్మెంట్లలో రతన్ టాటా కంపెనీ టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా మోటార్స్ కు చెందిన చాలా వాహనాలు ఫైవ్ స్టార్ రేటింగ్‌లను పొందాయి. అయితే టాటా తన వాహనాలన్నింటిని ఇంత పటిష్టంగా ఎలా తయారు చేసింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? టాటా మోటార్స్ వాహనాలు ఎందుకు చాలా సురక్షితమైనవి, వాటిపై న‌మ్మ‌కాన్ని పెంచేందుకు టాటా కంపెనీ ఏమి చేస్తుందో మాకు తెలుసా?

అధిక నాణ్యత కలిగిన స్టీల్

టాటా మోటార్స్ వాహనాలను తయారు చేసేటప్పుడు నాణ్యత విషయంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీపడదు, ఈ కంపెనీ ఎల్లప్పుడూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుంటుంది. త‌క్కువ ధ‌ర క‌లిగిన వాహనాల్లో కూడా కంపెనీ అధిక దృఢ‌మైన‌ స్టీల్‌ను వాడడానికి ఇదే కారణం. ఇది కారు నిర్మాణాన్ని బలపరుస్తుంది. ఒక భవనానికి బ‌ల‌మైన‌ పునాది ఎంత బలంగా చేకూరుస్తుందో.. అలాగే వాహనం కూడా దృఢంగా నిర్మించడం వ‌ల్ల ఎప్పుడైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అందులో కూర్చున్న వారికి ఎలాంటి హానీ క‌ల‌గ‌కుండా పూర్తి భద్రతనిస్తుంది. నివేదికల ప్రకారం, కొన్ని మోడళ్లలో కంపెనీ కారు ప్రధాన భాగాలలో ఎక్కువ మందం గ‌ల స్టీల్ ను వినియోగించింది. ఇది వాటి బలం, మన్నికను పెంచింది.

READ MORE  Tesla Cybercab | టెస్లా అద్భుతమైన ఆవిష్కరణ.. స్టీరింగ్, పెడల్స్ లేని రోబోటాక్సీ..

ఫ్యూచరిస్టిక్ డిజైన్, క్రాష్ టెస్టింగ్

టాటా మోటార్స్ (TATA Motors) కార్లను డిజైన్ చేసేటప్పుడు కంప్యూటర్ సిమ్యులేషన్‌లను ఉపయోగిస్తుంది. క్రాష్‌లో కారు ఎలా స్పందిస్తుందో, లోప‌ల‌ ప్రయాణీకులకు మెరుగైన రక్షణ అందిస్తుందా లేదా అని ప‌రీక్షిస్తుంది. నివేదికల ప్రకారం, కారు ఎంత కఠినమైనదో, వాహనాలు భారతీయ, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అనేది నిర్ధారించడానికి కంపెనీ స్వయంగా అనేక క్రాష్ పరీక్షలను నిర్వహిస్తుంది.

టాటా మోటార్స్ నిరంతరం కస్టమర్ల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటుంది. ఆ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కార్లను మెరుగుపరుస్తుంది. ఇది కాకుండా, వాహనాల్లో కొత్త టెక్నాలజీని తీసుకురావడంలో టాటా మోటార్స్ కూడా ముందుంది. ఈ అన్ని కారణాల వల్ల, టాటా మోటార్స్ వాహనాలు సురక్షితంగా, బలంగా ఉన్నాయి.

READ MORE  అత్యాధునిక ఫీచర్లు.. అనువైన ధరలో Tata Altroz iCNG

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *