ఆ ఊరిలో యూట్యూబర్స్ కోసం అత్యాధునిక స్టూడియో ఏర్పాటు చేసిన ప్రభుత్వం… రూ.లక్షల్లో సంపాదిస్తున్నయవత..
ప్రస్తుతమున్న డిజిటల్ ప్రపంచంలో యూట్యూబర్లదే హవా.. ఏదో సరదాకు వీడియోలు తీయడం కాకుండా.. అదే ప్రధాన ఉపాధిగా ఎంచుకుంటూ ఎంతో మంది విజయం సాధిస్తున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఓ ప్రత్యేక గ్రామం ఉంది. ఆ ఊరికి వెళ్తే అడుగడుగునా యూట్యూబర్లే కనిపిస్తారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలోని తులసి అనే గ్రామం యూట్యూబర్లకు ప్రసిద్ధి చెందింది. 10వేల జనాభా గల ఈ గ్రామంలో ప్రతీ వీధిలో ఇద్దరో ముగ్గురో యూట్యూబర్లు ఉన్నారు.రాయ్‌పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఈ తులసి గ్రామం ఉంది. ఈ గ్రామంలో 1100 మంది యూట్యూబర్‌లు ఉన్నారు. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా చురుకుగా ఉంటున్నారు. అయితే యూట్యూబ్ లో అద్భుతమైన కంటెంట్ తో వీడియోలు చేస్తున్న యువతను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.తులసి గ్రామంలో కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సాహకంగా జిల్లా యంత్రాంగం ఆధునిక పరికరాలతో కూడిన...