Saturday, August 30Thank you for visiting

Tag: wether news

Rains | రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

Rains | రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

Andhrapradesh
Rains | వరుణుడు మరోసారి తెలుగు రాష్ట్రాలను ప‌ల‌క‌రించ‌నున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వెస్ట్‌ బెంగాల్‌తో పాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  (AP, TG Rains) మరో 4 రోజుల పాటు ఉంటుందని అంచనా వేసింది. రానున్న 4 రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమ ప్రాంతంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాయలసీమ జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో లో రానున్న మూడు రోజుల పాటు తేలిక...
TG Rain Alert | వాయుగుండంగా అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌

TG Rain Alert | వాయుగుండంగా అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌

Telangana
TG Rain Alert | వాయువ్య‌ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ తీరానికి స‌మీపంలో ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్ల‌డించింది. వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌కారం.. శనివారం తెల్లవారుజామున వాయువ్యదిశగా ప్ర‌యాణించి.. పూరీ సమయంలో ఒడిశా తీరాన్ని దాటే అవ‌కాశం ఉంది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా క‌దులుతూ 24గంటల్లో బలహీనపడుతుందని తెలిపింది.ఈ క్రమంలో రానున్న‌ రెండురోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కరీంనగర్‌, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంటూ వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ను...
Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం

Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం

Telangana
Rainfall | హైదరాబాద్: తెలంగాణ లో జూలై 12 నుంచి 15 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ప‌లుజిల్లాల్లో స‌రైన వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డంతో క‌రువు ప‌రిస్థితులు వ‌స్త‌యేమోన‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.ఈ క్ర‌మంలోనే వాతావ‌ర‌ణ కేంద్రం వ‌ర్షాల‌కు సంబంధించి కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. శుక్ర‌వారం నుంచి వ‌రుస‌గా మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని తెలిపింది. ఈమేర‌కు భారత వాతావరణ శాఖ (IMD) అనేక జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది, ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్లానింగ్ డెవలప్‌మెంట్ అండ్ సొసైటీ డేటా ప్రకారం, రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హైద‌రాబాద్ ప‌రిధిలో 174.6 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక్క‌డ‌ సాధారణ పరిధి 154 ...
TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ

TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ

Telangana
TG Weather Report | తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది ఐఎండి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైద‌రాబాద్‌ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.ఇక నిజామాబాద్‌, కామారెడ్డి , కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జ‌యశంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, మహబూబాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, జిల్లాలో బుధవారం నుంచి గురువార...
Telangana Rain Alert :  తెలంగాణలో నాలుగు రోజులపాటు వ‌ర్షాలే.. వ‌ర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

Telangana Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులపాటు వ‌ర్షాలే.. వ‌ర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

Telangana
Telangana Rain Alert | తెలంగాణలో రానున్న‌ నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చ‌రించింది. సోమవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, వరంగల్‌, హనుమ‌కొండ, జనగామ‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.సోమవారం నుంచి మంగళవారం వరకు ఉమ్మ‌డి కరీంనగర్‌, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డిలో వ‌ర్షాలు వానలు కురిసే చాన్స్‌ ఉందని తెలిపింది. ఇక‌ మంగళవ...