Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Warangal Police

Warangal | గంజాయి నియంత్రణకు వరంగల్ లో  ప్రత్యేకంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్
Telangana

Warangal | గంజాయి నియంత్రణకు వరంగల్ లో ప్రత్యేకంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్

Warangal | తెలంగాణలో మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలల్లో భాగంగా వరంగల్ నగరంలో కొత్తగా  ఏర్పాటు చేసిన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ (Warangal Narcotics Police Station) ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నార్కోటిక్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య, శాంతిభద్రతల అదనపు మహేష్ భగవత్, ఎస్పీ సాయి చైతన్య ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం ములుగు రోడ్డు లోని ఇండస్ట్రీయల్ ఏరియాలో నూతనంగా నెలకొల్పబడిన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ భవనం నుంచి అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈ నూతన నార్కోటిక్ పోలీస్ స్టేషన్ తొలి డిఎస్పీ బాధ్యతలు చేపట్టిన సైదులుని నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు ఎస్పీ సాయిచైతన్య అభినందించారు.ఈ సందర్బంగా నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ తెలంగాణ...
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం
Crime, National

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

వరంగల్: అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలతోపాటు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యు లు గల ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2కోట్లు విలువైన 2కిలోల 380 గ్రాముల బంగారం, వజ్రాభరణాలు, రూ.5.20 లక్షల విలువైన 14 గంజాయి ప్యాకెట్లు, పిస్టల్, కారు, నాలుగు సెల్ ఫోన్లు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్ కార్డులు రూ.5వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అక్బర్ ఖురేషి(ఘజియాబాద్,ఉత్తరప్రదేశ్), కపిల్ జాటోవు (మీరట్), మహ్మద్ షరీఫ్ (ఘజియాబాద్), ఎండి జాద్ ఖాన్(ఘజియాబాద్) ఉన్నారు. అరెస్టు వివరాలను వరం గల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 5న వరంగల్ మట్టెవాడ, హన్మకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అపార్ట్ మెంట్లో తాళం వేసిన ఉన్న 8 ఇళ్లలో పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆ...
పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు
Crime, Local

పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

Warangal : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇళ్లో  చోరీలకు పాల్పడుతున్న దొంగను సీీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దొంగ నుంచి పోలీసులు రూ.10లక్షల 9 వేల విలువ గల 163 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడిండిచారు. సూర్యపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిది ఆంజనేయులు అలియాస్ అంజి చదువుకునే రోజుల్లోనే చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కగా జువైనల్ హోంకు తరలించారు. కొద్ది రోజుల అనంతరం నిందితుడు మరో మారు మిర్యాలగూడ, ఖమ్మం, హుజూర్ నగర్, గద్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితుడు ఆంజనేయులును పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిలో జైలు విడుదలయిన తర...
సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. 
Local

సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. 

వరంగల్ పోలీసుల హెచ్చరిక వరంగల్: ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు హెచ్చరించారు. సోమవారం హన్మకొండలోని కేయూ క్రాస్ వద్ద భారీ శబ్ధం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. కాగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పలు ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో భారీ శబ్బాలు వచ్చేలా సైలెన్సర్లను రీప్లేస్ చేస్తున్నారు. దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ.విరంగనాథ్ ఆదేశాల మేరకు ఇటువంటి ఆకతాయిలపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.ఇందులో భాగంగా కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు విరుద్ధంగా భారీ శబ్ధం వచ్చే సైలెన్సర్లు కలిగిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుంచి సైలెన్సర్లను ట్రాఫిక్ ప...