walkie-talkies Explosions | మరో కొత్త తరహా యుద్ధం. పేలిపోతున్న వాకీ-టాకీలు, బ్యాటరీలు..
walkie-talkies Explosions | జెరూసలేం : లెబనాన్ లో వేల సంఖ్యలో పేజర్లు పేలుళ్ల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. అది మర్చిపోకముందే.. మధ్యప్రాచ్య దేశం మళ్లీ హ్యాండ్‌హెల్డ్ రేడియోలు (వాకీ-టాకీలు), సాయుధ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉపయోగించిన సోలార్ పరికరాలను పేల్చివేసింది. ఈ పేలుళ్లలో బుధవారం మధ్యాహ్నం 20 మంది మరణించగా,, 450 మందికి పైగా గాయపడ్డారు. ఇది మరింత ఉద్రిక్తతలను రేకెత్తించింది. ఒక సంవత్సరం క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లా మధ్య ఇప్పడు ఎన్నడూ ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది.మంగళవారం పేజర్ పేలుళ్లపై ఇజ్రాయెల్ మౌనంగా ఉండగా, వాకీ-టాకీ పేలుళ్లు లెబనాన్‌ను కదిలించడంతో ఇజ్రాయెల్ సైన్యం బుధవారం 'కొత్త దశ' యుద్ధాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ బుధవారం ఇజ్రాయెల్ దళాలతో మాట్లాడుతూ, "మేము యుద్ధంలో కొత్త దశ ప్రారంభంలో ఉన్నా...