
Uttarakhand | మరో రైలు ప్రమాదానికి కుట్ర..? రూర్కీలో రైల్వే ట్రాక్‌లపై LPG సిలిండర్
cylinder on the railway tracks : ఉత్తరఖండ్ లో మరో రైలు ప్రమాదానికి దుడగులు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూర్కీ(Roorkee ) లోని ధండేరా స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఖాళీ ఎల్‌పిజి సిలిండర్ కనిపించడంతో ఉత్తరాఖండ్‌లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించే కుట్రను పోలీసులు భగ్నం చేశారు.రైలు డ్రైవర్ సిలిండర్‌ను గమనించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఆదివారం ఉదయం 6:35 గంటల సమయంలో, ధంధేరా స్టేషన్ నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న లండోరా - ధంధేరా మధ్య పట్టాలపై సిలిండర్ కనిపించిందని రూర్కీలోని స్టేషన్ మాస్టర్‌కు గూడ్స్ రైలు లోకో పైలట్ ఫిర్యాదు చేశాడు. పాయింట్‌మెన్‌ని వెంటనే సంఘటన స్థలానికి పంపించి పరిశీలించగా ఆ సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు. అనంతరం సిలిండర్‌ను దంధేరా వద్ద స్టేషన్ మాస్టర్ కస్టడీలో ఉంచారు. స్థానిక పోలీసులకు, ప్రభుత్వ రైల్వే పోలీసులక...