UTS Mobile App : జనరల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఆన్ లైన్ టికెటింగ్‌లో కీలక అప్ డేట్..
UTS Mobile App : దేశవ్యాప్తంగా ఉన్న రైలు ప్రయాణికులకు ఒక పెద్ద వరంలాగా, భారతీయ రైల్వేలు టికెటింగ్ విధానంలో అద్భుతమైన మార్పును తీసుకువచ్చింది, ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) స్మార్ట్‌ఫోన్ యాప్‌ను ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి 20 కిలోమీటర్ల పరిమితిని రైల్వే అధికారులు తొలగించారు.
ఇది లక్షలాది మంది రైళ/ ప్రయాణీకులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది.
UTS యాప్ అప్‌డేట్‌తో కొత్తగా టికెటింగ్
జనరల్ క్లాస్ ప్రయాణీకులకు టికెటింగ్‌ను సులభతరం చేసేందుకు UTS మొబైల్ యాప్ పునరుద్ధరించారు. కీలకమైన మార్పులలో యాప్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకునే దూర పరిమితిని తొలగించడం తోపాటు తద్వారా ప్రయాణీకులు తమ ఇళ్ల నుంచే జనరల్ టిక్కెట్‌లను కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించింది.అయితే, ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్...