ఆస్పత్రి మార్చురీ ముందు ఏడాదిగా ఎదురుచూస్తున్న పెంపుడు కుక్క..! మనసును కదిలించే ఘటన..
పెంపుడు జంతువులు వాటి యజమానుల మధ్య ఉండే అనుబంధాన్ని అనేక సందర్భాల్లో చూస్తుంటాం. అలాగే, సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్న వీడియోలను చూసినప్పుడు మన హృదయాలు ద్రవిస్తాయి. ఒక్కోసారి మనుషుల కంటే జంతువులకే విశాల హృదయం, దయ, ప్రేమ ఉంటుందనిపించే సన్నివేశాలు ఎన్నో మనకు ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. జంతు ప్రేమికుల బృందం సోషల్ మీడియా లో షేర్ చేసిన ఒక పోస్టు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒక పెంపుడు కుక్క (Pet Dog ) తన యజమాని కోసం చూస్తున్న ఎదురుచూపులు అందరినీ కదలించేలా చేసింది. ఆ వివరాలు ఇవీ..ఫిలిప్పీన్స్‌లోని కాల్‌కూన్ నగరంలోని MCU హాస్పిటల్ మార్చురీ ఎదుట ఒక కుక్క రోజుల తరబడి పడిగాపులు కాస్తుంది. ఆహారం, నిద్ర లేకుండా ఆ కుక్క ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇదే ఆస్పత్రికి చేరుకుని మార్చురీ ముందే నిరీక్షిస్తుూ ఉంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది, అక్కడే చదువుతు...