Thursday, November 14Latest Telugu News
Shadow

Tag: Trains

Navratri Special Meal | ఇక రైళ్లలో రుచికరమైన నవరాత్రి స్పెషల్‌ భోజనం..

Navratri Special Meal | ఇక రైళ్లలో రుచికరమైన నవరాత్రి స్పెషల్‌ భోజనం..

Trending News
Indian Railways Navratri Special Meal | నవరాత్రి పండుగ సీజన్ సంద‌ర్భంగా భార‌తీయ రైల్వే ప్రయాణికుల గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణికుల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నాన్ని అందించేందుకు గానూ ‘నవరాత్రి వ్రత స్పెషల్‌ థాలి’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 150కి పైగా రైల్వే స్టేషన్లలో ఈ ‘నవరాత్రి స్పెషల్‌ థాలి’ భోజనాన్ని ప్రయాణికులు ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.సికింద్రాబాద్‌, ముంబై సహా వివిధ స్టేషన్లలో ప్రత్యేక భోజనాన్ని ప్రయాణికులు పొంద‌వ‌చ్చని, తయారీలో నాణ్యత, పోషకాహారం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున‌ట్లు రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఐఆర్‌సీటీసీ యాప్‌, ఈ-క్యాటరింగ్‌ వెబ్‌సైట్‌ నుంచి ప్రయాణికులు తమ పీఎన్‌ఆర్‌ నంబర్‌తో ప్రత్యేక భోజనాన్ని ఆర్డర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.Navratri Special Meal : నవరాత్రి వ్రత స్పెషల్‌ థాలి లభించే కొన్ని ముఖ్య...
విదేశాల్లో మన వందే భారత్ రైళ్లకు డిమాండ్.. కొనుగోలుకు సిద్ధం

విదేశాల్లో మన వందే భారత్ రైళ్లకు డిమాండ్.. కొనుగోలుకు సిద్ధం

Trending News
ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ భారీగా క్రేజ్ వస్తోంది. ఇప్పుడు వీటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీనికి కారణం ఏమిటో తెలుసా..?మనదేశంలో  తక్కువ ఖర్చుతో తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు(vande bharat express trains) ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది. మలేషియా, చిలీ, కెనడా  వంటి దేశాలు మన నుంచి వందే భారత్ రైళ్లను దిగుమతి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి . బయటి కొనుగోలుదారులు వందే భారత్ వైపు ఆకర్షితులవడానికి అనేక కారణాలు ఉన్నాయని కూడా ఆయా వర్గాలు చెబుతున్నాయి అందులో ముఖ్యమైనది  ఒకటి ఖర్చు.  ఇతర దేశాల్లో తయారయ్యే ఇలాంటి రైళ్ల ధర దాదాపు రూ. 160-180 కోట్లు ఖర్చు అవుతుండగా, ఇక్కడ వందే భారత్ రైలు రూ. 120-130 కోట్లతోనే అభివృద్ధి చేస్తున్నారు. దీంతో వారికి సుమారు 40 నుంచి 50 కోట్లు ఆదా అవుతుంది..  ఆకట్టుకునే స...
Diwali Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. దీపావళి నేపథ్యంలో రైల్వే కోచ్‌ల పెంపు

Diwali Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. దీపావళి నేపథ్యంలో రైల్వే కోచ్‌ల పెంపు

National
రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) గుడ్ న్యూస్‌ చెప్పారు. దీపావళి (Diwali), ఛఠ్‌ పూజ (Chhath Puja) పండుగ‌ల స‌మీపిస్తున్న క్ర‌మంలో రైల్వే కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులకి అనుగుణంగా అద‌నంగా 12,500 కోచ్‌లను (12,500 Additional Coaches) రైళ్ల‌కు జత చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి వైష్ణ‌వ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ పండుగ సీజన్‌లో (festive season) 108 రైళ్లలో జనరల్‌ కోచ్‌ల సంఖ్యను పెంచామ‌ని, ఛఠ్‌ పూజ, దీపావళి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ప్రత్యేక రైళ్లకు 12,500 కోచ్‌లు అదనంగా జత చేశామ‌ని తెలిపారు. 2024-25లో పండగ వేళల్లో ఇప్పటి వరకూ మొత్తం 5,975 ప్ర‌త్యేక‌ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించామ‌ని, ఈ నిర్ణయం దాదాపు కోటి మందికిపైగా ప్రయాణికులు పండుగ‌ల స‌మ‌యాల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సుల‌భంగా ప్ర‌యాణాలు సాగిం...
10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ఈ మార్గాల్లో ప్రారంభం

10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ఈ మార్గాల్లో ప్రారంభం

National
10 New Vande Bharat Express | భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాలు వేగంగా మారుతున్నాయి. ఆధునిక రైళ్లు ఇప్పుడు రైల్వేల ముఖ చిత్రాన్ని స‌మూలంగా మార్చేశాయి. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను మెరుగుప‌రిచేందుకు భారతీయ రైల్వే తన రైళ్లు, ట్రాక్‌లను ఆధునీకరించడంతోపాటు కవ‌చ్ వ్య‌వ‌స్థ‌ను కూడా అన్ని రూట్ల‌లో ఇన్ స్టాల్ చేస్తోంది. అయితే ప్రయాణికులకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చేప్పింది. సెప్టెంబర్ 15న ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటన సందర్భంగా 10 వందే భారత్ రైళ్లను ప్రకటించే/ప్రారంభించ‌నున్నారు.కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభంతో బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తాయి.10 New Vande Bharat Express : కొత్త వందే భారత్ రైళ్లు టాటా నగర్ నుంచి పాట్నా, టాటానగర్ నుండి బ...
New Vande Bharat Trains | కొత్త‌గా మ‌రో 3 వందే భారత్ రైళ్లు.. రైలు మార్గాలు, టైమింగ్స్‌..

New Vande Bharat Trains | కొత్త‌గా మ‌రో 3 వందే భారత్ రైళ్లు.. రైలు మార్గాలు, టైమింగ్స్‌..

National
New Vande Bharat Trains | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇది కీలక రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. కొత్త రైళ్లు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో ప‌లు రూట్లలో సేవలు అందిస్తాయి, ఇప్పుడు దేశవ్యాప్తంగా 280 జిల్లాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్ విస్తరణలో మరో మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు:1. చెన్నై సెంట్రల్ నుంచి నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2. మధురై నుంచి బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 3. మీరట్ సిటీ నుంచి లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ Chennai Central to Nagercoil Vande Bharat Express: మొద‌ట చెన్నై సెంట్రల్ నుంచి వందేభార‌త్ రైలు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. కానీ ఇది చెన్నై ఎగ్మోర్ నుంచి బు...
ఏపీ,  తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..  విజయవాడ డివిజన్ లో 13 రైళ్ల దారి మళ్లింపు!

ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. విజయవాడ డివిజన్ లో 13 రైళ్ల దారి మళ్లింపు!

Andhrapradesh
Vijayawada | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) ప‌రిధి లో 13 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ డివిజన్ లో భద్రతా పనుల కారణంగా 10 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్న‌ట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువ సంఖ్య‌లో రైళ్లు వెళ్లే విజయవాడ- ఏలూరు- నిడదవోలుకు మార్గానికి బ‌దులు.. విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా న‌డిపిస్తున్నారు. అలాగే పల్వాల్-న్యూ ప్రిథ్లా యార్డ్ మధ్య రైలు కనెక్టివిటీకి సంబంధించి పాల్వాల్ స్టేషన్‌లో ఇంటర్‌లాకింగ్ పనులు చేప‌డుతుండ‌డంతో మరో మూడు రైళ్ల‌ను దారి మళ్లించారు.పూజ సీజ‌న్ నేప‌థ్యంలో సంబల్‌పూర్-ఈరోడ్ మ‌ధ్య రెండు స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక వాల్తేర్ డివిజన్‌లో భ‌ద్ర‌తా పనుల నేప‌థ్యంలో రెండు రైళ్ల‌ను రీషెడ్యూల్ చేశారు. వి...
Train Tickets Booking | రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ట్రెయిన్‌ టికెట్ల బుకింగ్‌లో కొత్త నిబంధనలు

Train Tickets Booking | రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ట్రెయిన్‌ టికెట్ల బుకింగ్‌లో కొత్త నిబంధనలు

National
Train Tickets Booking | రైలు టికెట్లు కొనుగోళ్ల‌లో పాత నిబంధనలే మ‌ర‌లా అమల్లోకి వచ్చాయి. సాధారణంగా టికెట్ రిజర్వేషన్ చేయించుకునేవారికి కొందరికే బెర్తులు అందుబాటులోకి వస్తాయి. మిగతా అందరికీ వెయిటింగ్ లిస్టులో చూపిస్తుంది. అయితే ప్ర‌యాణికుల‌కు ప్రయాణం చేసే రోజుకు బెర్తు దొరుకుతుందిలే అనే నమ్మకంతో వెయిటింగ్ లిస్టు టికెట్లు తీసుకుని రిజర్వేషన్ బోగీలోనే ప్రయాణం చేస్తుంటారు.వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్ర‌యాణించేవారిని టికెట్ కలెక్టర్ జరిమానా విధించడంతోపాటు వారిని రైలు నుంచి కిందకు దింపే అధికారం ఉంటుంది. మ‌రోవైపు వెయిటింగ్ లిస్టు టికెట్ క‌లిగిన ప్ర‌యాణికులు ఏసీ కోచ్ లో ప్రయాణం చేయొద్ద‌నే నిబంధన కూడా ఉంది. ఇన్ని రోజులు అంతగా ప‌ట్టించుకోని రైల్వే అధికారులు ఇక‌నుంచి ఈ నిబంధ‌న‌ల‌ను కఠినంగా అమలు చేయనున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి భార‌తీయ రైల్వే నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు త...
Rail News | రైలు ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌నిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

Rail News | రైలు ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌నిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

National, Trending News
Rail News | రైలు ప్రయాణికులకు సంతోషం క‌లిగించేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం త‌గ్గిపోయిన కార‌ణంగా రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించాల‌న్న కార‌ణంతో పలు స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ సౌక‌ర్యాన్ని నిలిపివేయాల‌ని నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌, ఏపీలో కొన్ని రైల్వే స్టేషన్లను పూర్తిగా మూసేశారు కూడా. మరోవైపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు గతంలో ఇచ్చిన హాల్టింగ్ గడువు ముగియడంతో రాకపోకలు ఆగిపోతాయని అంద‌రూ భావించారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 69 రైళ్లకు ఆయా స్టేషన్లలో హాల్టింగ్ సౌక‌ర్యాన్ని పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈనెల 29వ తేదీతో మొత్తం 69 రైళ్లకు గతంలో జారీ చేసిన గడువు ముగుస్తోంది.ప్రయాణికుల డిమాండ్ తో ప‌లు రైల్వేస్టేషన్లలో రైళ్లను నిలిపేందుకు అనుమతిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్ల‌డించింది. విజయవాడ మీదుగా రాకపోకలు ...
Metro Tickets | ఇకపై నేరుగా రాపిడో నుంచే మెట్రో టికెట్లు బుక్ చేసుకోచ్చు..

Metro Tickets | ఇకపై నేరుగా రాపిడో నుంచే మెట్రో టికెట్లు బుక్ చేసుకోచ్చు..

Telangana
Metro Tickets | హైదరాబాద్ ప్రయాణికులకు ఎండ్-టు-ఎండ్ ర‌వాణా సౌక‌ర్యాన్ని అందించడానికి, రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన రాపిడో (Rapido) యాప్ ద్వారా మెట్రో టిక్కెట్ బుకింగ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. దీని వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. మెట్రో స్టేషన్లలో క్యూలైన్ల వద్ద రద్దీ కూడా తగ్గిపోతుంది. రాపిడో ద్వారా ప్రయాణికులు కనీసం 15 శాతం టిక్కెట్‌లను కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ భావిస్తోంది.ప్రయాణికులు ఇప్పుడు యాప్ ద్వారా సమీపంలోని మెట్రో స్టేషన్‌కు రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. వారు కోరుకున్న గమ్యస్థానానికి మెట్రో టిక్కెట్‌ల (Metro Tickets)ను సజావుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది. చేయవచ్చు. మెట్రో సెక్టార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రాజెక్ట్ (PPP), హైదరాబాద్ మెట్రో రైలులో రోజుకు సగటున 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. Rapid...
Special Train | సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..

Special Train | సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..

Telangana
Special Train : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్‌ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్‌-భావ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్‌-భావనగర్‌ (07061) మధ్య జూలై 19, 26వ తేదీ నుంచి ఆగస్టు 2, 9వ తేదీల్లోఈ ప్ర‌త్యేక‌ రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 5.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. అలాగే భావ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (07062) రైలు జూలై 21, 28, ఆగస్టు 4, 11వ‌ తేదీల్లో ఉదయం 10.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు గమ్యస్థానం చేరుతుందని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే వెల్ల‌డించింది. హాల్టింగ్ స్టేషన్లు.. ఈ రైళ్లు రెండు మార్గాల్లో మేడ్చల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, ముఖ్దేడ్‌, నాందేడ్‌, పూర్ణ, బస్మత్‌, హింగోలి, వాషిమ్‌, అకోల, భుస్వాల్‌, నందుర్బర్‌, సూరత్‌, వడోదర, అహ్మదాబాద్‌, విరాంగమ్‌, సురేంద్రనగర్‌, ధోలా, సోంగద్‌ తదితర...