Friday, January 23Thank you for visiting

Tag: Telugu news

కేరళలో అంతుచిక్కని వ్యాధి.. రక్తపు వాంతులతో ఐదుగురు మహిళలు మృతి

కేరళలో అంతుచిక్కని వ్యాధి.. రక్తపు వాంతులతో ఐదుగురు మహిళలు మృతి

National
కేరళలో మరో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపింది. ఐదుగురు వృద్ధ మహిళలు పాదాల కింద బొబ్బలు పెరగడంతోపాటు రక్తపు వాంతులతో ఒక్కొక్కరుగా మృత్యువాత పడడం షాక్ గురిచేసింది.కేరళలోని మువట్టుపుజా(Muvattupuzha)లోని స్నేహవీడు(Snehaveedu) అనే వృద్ధాశ్రమంలో రెండు వారాల వ్యవధిలో ఒక అంతుచిక్కని చర్మ వ్యాధి ఐదుగురు వృద్ధ మహిళలను బలిదీసుకుంది. స్నేహం ఛారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (Sneham Charitable and Educational Trust) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు మహిళల మరణానికి ముందు ఇలాంటి లక్షణాలను కనిపించినట్లు స్థానికులు తెలపిారు. వారు వారి పాదాల కింద వాపు, బొబ్బలు వచ్చాయి. అది చివరికి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించింది. వారి చర్మం ఊడిపోయినట్ల కనిపించింది. తర్వాత వీరంతా రక్తపు వాంతులు చేసుకున్నారు.ఇవే లక్షణాలు కనిపించిన మరో ఆరుగురు బాధితులను మువట్టుపుజా జనరల్ ఆసుపత్రిలో ...
జ్ఞానవాపి మసీదులో సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు సంచనల తీర్పు..

జ్ఞానవాపి మసీదులో సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు సంచనల తీర్పు..

National, Trending News
జ్ఞానవాపి(Gyanvapi) మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖ (ASI)కు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు గురువారం సమర్థించింది. సర్వేను వెంటనే పునఃప్రారంభించవచ్చని పేర్కొంది. సర్వేకు వ్యతిరేకంగా అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్‌ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. "జ్ఞానవాపి మసీదు సముదాయంలో ASI సర్వే ప్రారంభించవచ్చని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తెలిపింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను హెచ్‌సి సమర్థించింది" అని జ్ఞానవాపి సర్వే కేసులో హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ANIకి తెలిపారు.జూలై 27న ఏఎస్...
కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ

కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ

Trending News
తమిళనాడులో హృదయవిదారక ఘటన సృష్టిలో తల్లి ప్రేమ మందు ఏదీ సాటిరాదు. తన పిల్లల కోసం ఏం చేయడానికైనా మాతృమూర్తులు వెనుకాడరు. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేస్తారు. తన కొడుకు కాలేజీ ఫీజులను సమకూర్చేందుకు ఓ మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు కింద పడి ప్రాణాలను తీసుకుంది. పిల్లల ఫీజుల కోసం తనను తాను చంపుకోవడం హృదయాలను కలిచివేసింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన దృశాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.తమిళనాడులో ఓ మహిళ తన కుమారుడి చదువు కోసం డబ్బు సమకూర్చేందుకు బస్సు కిందకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. సేలం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో 'సఫాయి కర్మచారి' (క్లీనింగ్ స్టాఫ్)గా పనిచేస్తున్న ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు ముందు దూకినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది.యాక్సిడెంట్‌లో చనిపోతే తన...
‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..

‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..

Entertainment, Trending News
‘వందేమాతరం’.. పాటతో మార్మోగిన స్టేడియం.. శాఫ్ చాంపియన్‍షిప్ ఫైనల్‍లో భారత్ గెలిచిన తర్వాత స్టేడియంలోని వేలాది మంది మా తుఝే సలాం పాట పాడారు. ఈ వీడియోలు వైరల్‍గా మారాయి. సౌత్ ఏషియన్ ఫుల్‍బాల్ ఫెడరేషన్ (SAFF- శాఫ్) చాంపియన్‍షిప్ టోర్నమెంట్ టైటిల్‍ను ఇండియా ఫుల్‍బాల్ జట్టు 9వ సారి గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఈ ఫైనల్‍లో కువైట్‍పై పెనాల్టీ షూటౌట్ లో గెలిచి మరోసారి శాఫ్ విజేతగా అవతరించింది టీమిండియా . మ్యాచ్ సమయంలో 1-1తో రెండు జట్లు సమానంగా నిలవగా... తర్వాత పెనాల్టీ షూ టౌట్ జరిగింది. ఇందులో 5-4తో భారత జట్టు ఘన విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీకంఠీరవ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగిం ది. టీమిండియా గెలుపొందగానే స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు ‘‘మా తుఝే సలాం’’ అనే పాటను ముక్తకంఠంతో పాడారు. వందేమాతరం అంటూ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్...
138 జంటల విడాకులను అడ్డుకున్న న్యాయవాది.కానీ, ఆయనకే విడాకులు ఇచ్చిన భార్య..!

138 జంటల విడాకులను అడ్డుకున్న న్యాయవాది.కానీ, ఆయనకే విడాకులు ఇచ్చిన భార్య..!

Crime
ఆయన ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ సీనియర్‌ న్యాయవాది. తన 16 ఏళ్ల న్యాయవాద వృత్తిలో విడాకుల కోసం వచ్చిన జంటలకు నచ్చజెప్పి కలిసి జీవించేలా చేశారు. కానీ, విచిత్రంగా ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆర్థిక పరిస్థితులు ఆయన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌ హైకోర్టులో ఓ వ్యక్తి 16 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తన వృత్తిలో భాగంగా 138 జంటలు విడాకులు తీసుకోకుండా అడ్డుకున్నారు. విడాకుల కేసు వేసిన భార్య సదరు న్యాయవాది భార్య తనకు విడాకులు కావాలంటూ కేసు ఫైల్‌ చేసింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కారణాలు పేర్కొంది. విడాకుల కోసం వచ్చే జంటలను విడిపోకుండా ఆపడమేకాకుండా ఎలాంటి ఫీజులు తీసుకోవడంలేదని వివరించింది. ఏమాత్రం ఫీజులు తీసుకోకపోవడంతో ఉచితంగా న్యాయసేవలు అందించడంతో ఆ...